చిత్తూరు సెషన్స్‌ కోర్టు కేసులో వాదనలకు ఏపీపీ మార్పు

ABN , First Publish Date - 2021-04-09T08:22:34+05:30 IST

చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో 110/2016 నంబరుతో విచారణలో వున్న క్రిమినల్‌ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున వాదనలు వినిపించడానికి అదే కోర్టులోని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ టి.నిర్మలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరు సెషన్స్‌ కోర్టు కేసులో వాదనలకు ఏపీపీ మార్పు

కలికిరి, ఏప్రిల్‌ 8: చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో 110/2016 నంబరుతో విచారణలో వున్న క్రిమినల్‌ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున వాదనలు వినిపించడానికి అదే కోర్టులోని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ టి.నిర్మలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కేసులో ప్రభుత్వం తరపున హాజరవడానికి తిరుపతి ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులోని గ్రేడ్‌-2 ఏపీపీ ఎస్‌.వెంకటనారాయణ, చిత్తూరు ఒకటో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టులోని మరో ఏపీపీ వి.లోకనాథ రెడ్డిని నియమిస్తూ 2019లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే 2021 డిసెంబరు 28న రాష్ట్ర హైకోర్టు ఒక రిట్‌ పిటిషన్‌లో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టరు చేసిన ప్రతిపాదనల మేరకు ఈ ఇద్దరు ఏపీపీల నియామకాలకు సంబంధించి గతంలో జారీ అయిన ఆదేశాలను రద్దు చేసింది. వారికి బదులుగా 110/2016 నంబరు కేసును టి.నిర్మలకు అప్పగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-04-09T08:22:34+05:30 IST