కరోనా ఎఫెక్ట్... ‘ప్యాకేజీ’ కోసం డిమాండ్...

ABN , First Publish Date - 2021-06-18T21:43:15+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో ఆయా వర్గాలు మరో ఉద్దీపన ప్యాకేజీని కోరుతున్నాయి.

కరోనా ఎఫెక్ట్... ‘ప్యాకేజీ’ కోసం డిమాండ్...

ముంబై : కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో ఆయా వర్గాలు మరో ఉద్దీపన ప్యాకేజీని కోరుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ నుండి కోలుకునే సమయంలో సెకండ్ వేవ్ దారుణంగా దెబ్బతీసిందని, ఈ పరిస్థితుల్లో ఆర్థిక ప్యాకేజీ అవసరమని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. ఈ ఆర్థిక ప్యాకేజీ కనీసం రూ. 3 లక్షల కోట్లు ఉండాలని పేర్కొంది.


సీఐఐ కొత్త అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ ఈ మేరకు పేర్కొన్నారు. ప్యాకేజీ లేకుంటే ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించడం కష్టమన్నారు. జన్ ధన్ ఖాతాలకు నేరుగా నగదు బదలీ ద్వారా పేదలను ఆదుకోవాలని నరేంద్రన్ కోరారు. నిధుల లభ్యత పెంచడం ద్వారా ఆర్‌బీఐ కూడా ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. 

Updated Date - 2021-06-18T21:43:15+05:30 IST