అప్పిరెడ్డి ప్రమాణ స్వీకారానికి తరలిన నేతలు

ABN , First Publish Date - 2021-06-22T06:20:34+05:30 IST

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్లున్న లేళ్ళ అప్పిరెడ్డి గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన విషయం విదితమే. సోమవారం శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో అప్పిరెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు.

అప్పిరెడ్డి ప్రమాణ స్వీకారానికి తరలిన నేతలు
అప్పిరెడ్డికి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, మేయర్‌ కావటి, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌, రోశయ్య, చైర్మన్‌లు ఏసురత్నం, రాము

గుంటూరు, జూన్‌ 21: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్లున్న లేళ్ళ అప్పిరెడ్డి గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన విషయం విదితమే. సోమవారం శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో అప్పిరెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి బయల్దేరిన అప్పిరెడ్డి పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి తొలుత స్తంబాలగరువు సెంటర్‌లో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం స్వామి ధియేటర్‌ సెంటర్‌, నగరంపాలెం సెంటర్లలోని వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు ఘన నివాళులర్పించిన ఆయన ర్యాలీగా బస్టాండ్‌, ఆటోనగర్‌ మీదుగా శాసనమండలికి బయల్దేరారు. 


నేతల శుభాకాంక్షల వెల్లువ


ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అప్పిరెడ్డికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హోంమంత్రి సుచరిత, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్‌, నగరమేయర్‌ కావటి శివనాగమనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌ డైమండ్‌బాబు, ఎమ్మెల్యేలు ఎండీ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌,  డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, నంబూరు శంకరరావు, కిలారి రోశయ్య, విడదల రజని, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కేఎస్‌ లక్ష్మణరావు, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌, మక్కెన మల్లికార్జునరావు, డీసీసీబీ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య ఇతర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు.


గుంటూరు ప్రజలకు ధన్యవాదాలు: అప్పిరెడ్డి


కులం, మతం, ప్రాంతం చూడకుండా 30 ఏళ్ళుగా తనను గుండెల్లో పెట్టుకున్న గుంటూరు ప్రజలకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన దైవం సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. ఈ పదవితో నగర ప్రజలకు మరింత సేవ చేస్తానన్నారు.


Updated Date - 2021-06-22T06:20:34+05:30 IST