టెక్‌ దిగ్గజ సారథులపై ప్రశ్నల వర్షం!

ABN , First Publish Date - 2020-07-31T07:58:44+05:30 IST

ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌.. ప్రపంచాన్ని ఏలుతున్న టెక్నాలజీ దిగ్గజాలు.

టెక్‌ దిగ్గజ సారథులపై ప్రశ్నల వర్షం!

  • ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌ సీఈఓలను..
  • విచారించిన యూఎస్‌ చట్టసభల ప్రతినిధులు


వాషింగ్టన్‌, జూలై30: ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌.. ప్రపంచాన్ని ఏలుతున్న టెక్నాలజీ దిగ్గజాలు. ఈ కంపెనీల ధాటికి చిన్నచిన్న కంపెనీలు నామరూపంలేకుండా పోతున్నాయి! మరికొన్ని కంపెనీలకు ఇవి గట్టి సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. అనేక సందర్భా ల్లో ఈ దిగ్గజ కంపెనీలపై ఎన్నో ఆరోపణలు సైతం వ స్తున్నాయి. ఆధిపత్య ధోరణులను అనుసరించడమేకాకుండా పోటీని అణచివేయడానికి గుత్తాధిప త్య విధానాలను అనుసరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయినా ఈ కంపెనీలు పట్టించుకోకుండా ముందుకువెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ ల సీఈఓలను అమెరికా కాంగ్రెస్‌ చట్టసభల ప్రతినిధు లు బుధవారం విచారించారు. ఈ విచారణలో ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ పాల్గొన్నారు. 


బహుళజాతి సంస్థల పెత్తందారి పోకడలపై ఏర్పాటైన హౌస్‌ జుడీషియరీ సబ్‌కమిటీ విచారణలో భాగంగా చట్టసభల ప్రతినిధులు ఈ సీఈఓలపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు ఐదుగంటల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రశ్నలు సంధించారు. సీఈఓలు తాము ఎదుర్కొంటున్న పోటీకి సంబంధించిన డేటాను వివరించే ప్రయత్నం చేశారు. తమ ఇన్నోవేషన్లు, వినియోగదారులకు అందిస్తున్న అత్యవసర సర్వీసులు ఎంత విలువైనవో వివరించారు. అయితే వారి వ్యాపా ర విధానాలకు సంబంధించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో కొంత ఇబ్బందులకు గురయ్యారు. 


రాజకీయ పక్షపాతం, అమెరికా ప్రజాస్వామ్యంపై కంపెనీల ప్రభావం, చైనాలో వాటి పాత్రపై ప్రశ్నలను సీఈఓలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌లు నియంత్రించే ప్రతి ప్లాట్‌ఫామ్‌ కూడా పంపిణీకి కీలకమైన చానల్‌కు అవరోధంగా ఉంటున్నట్టు కమిటీ చైర్మన్‌ డేవిడ్‌ సిసిలిన్‌ పేర్కొన్నారు.  ఈ నలుగురు సీఈఓలు కార్పొరేషన్లను శాసిస్తున్నారని, కోట్లాది మంది వినియోగదారులు వీరి కంపెనీల ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్నారు. ఈ కంపెనీల మార్కెట్‌ విలువ మొత్తం జర్మనీ ఆర్థిక వ్యవస్థకన్నా ఎక్కువగా ఉంటుందన్నారు.


చైనా టెక్నాలజీ దొంగిలించింది : జుకర్‌బర్గ్‌

దిగ్గజ కంపెనీల నుంచి టెక్నాలజీని చైనా దొంగిలిస్తోందన్న ఆరోపణలు వ స్తున్నాయని, దీనిపై సమాధానమివ్వాలని రిపబ్లిక న్‌ పార్టీకి చెందిన గ్రెగ్‌ స్టెబె నలుగురు సీఈఓలను ప్రశ్నించారు. అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీల నుంచి చైనా ప్రభుత్వం టెక్నాలజీని తస్కరిస్తోందని ఇప్పటికే స్పష్టమైందని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-31T07:58:44+05:30 IST