Abn logo
Jan 23 2021 @ 00:18AM

యాపిల్‌ కార్లపై టిమ్‌ కుక్‌ నో కామెంట్‌

యాపిల్‌ కారు 2024 నాటికి వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో దానిపై కామెంట్‌ చేసేందుకు ఆ సంస్థ సిఇఒ టిమ్‌ కుక్‌ నిరాకరించారు. కారును ఉత్పత్తి చేసేందుకు హ్యుందాయ్‌తో యాపిల్‌ ఒప్పందం చేసుకుంటోందని విశ్లేషకులు చెప్పడంతో సంబంధిత వార్తలు మార్కెట్లో షికారు చేశాయి.

 

యాపిల్‌ కార్లను తయారు చేస్తోందా అనే ప్రశ్నకు ఆయన ప్రపంచంలో బెస్ట్‌ అనిపించుకునే ఉత్పత్తుల తయారీలో ముందుంటామని డొంక తిరుగుడుగా సమాధానం ఇచ్చారు. అలా అని యాపిల్‌ కారు తయారు చేయడం లేదని కూడా ఖండించలేదు. అయితే ఆయన అంతకుమునుపు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను ఆయనే ప్రస్తావించారు. అదే సంబందిత అన్ని ప్రాజెక్టులకు మాతృకగానూ అభివర్ణించారు. అలాగే ఎలక్ట్రిక్‌ కార్ల విషయమై కూడా అదే సందర్భంలో కుక్‌ మాట్లాడటం విశేషం.

Advertisement
Advertisement
Advertisement