39,000 చైనా గేమ్‌ యాప్స్‌కి..యాపిల్‌ చెక్‌

ABN , First Publish Date - 2021-01-02T06:17:09+05:30 IST

‘యాపిల్‌’ ఒకే రోజు చైనా స్టోర్‌ నుంచి 39,000 యాప్‌లను తొలగించింది. 2020 ఏడాది చివరి రోజు వరకు లైసెన్స్‌ పొందని వాటిని తమ స్టోర్‌ నుంచి తొలగించింది

39,000 చైనా గేమ్‌ యాప్స్‌కి..యాపిల్‌ చెక్‌

‘యాపిల్‌’ ఒకే రోజు చైనా స్టోర్‌ నుంచి 39,000  యాప్‌లను తొలగించింది.  2020 ఏడాది చివరి రోజు వరకు లైసెన్స్‌ పొందని వాటిని తమ స్టోర్‌ నుంచి తొలగించింది.  లైసెన్స్‌ లేని యాప్‌లను నిషేధించాలని చైనా అథారిటీలు నిర్ణయించడంతో యాపిల్‌ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఈ 39000 యాప్‌లతో కలిపి మొత్తంగా 46,000 యాప్‌లను డిసెంబర్‌ 31న మంగళం పాడింది. యూబీ సాఫ్ట్‌ టైటిల్‌ అసాసిన్‌కు చెందిన క్రీడ్‌ ఐడెంటిటి, ఎన్‌బిఎ 2కె20 కి చెందిన గేమ్స్‌లు కూడా ఈ వేటు పడిన వాటిలో ఉన్నాయని రీసెర్చ్‌ సంస్థ క్విమై తెలిపింది. 1500 టాప్‌ పెయిడ్‌ గేమ్స్‌లో కేవలం 74 మాత్రమే ఈ వేటు నుంచి తప్పించుకున్నాయి. గేమ్‌ యాప్స్‌ అన్నీ ప్రభుత్వ లైసెన్స్‌ నెంబర్‌ను  2020 జూన్‌లోపు అందజేయాలని తొలుత యాపిల్‌ గడువుగా నిర్ణయించింది. తదుపరి ఆ గడువును డిసెంబర్‌ 31 వరకు పెంచినా పెద్దగా స్పందన లేకపోవడంతో  వాటిపై వేటు వేసింది.

Updated Date - 2021-01-02T06:17:09+05:30 IST