దివ్యాంగుల కోసం యాపిల్‌ ఫీచర్లు

ABN , First Publish Date - 2021-05-22T09:00:16+05:30 IST

దివ్యాంగులను ఉద్దేశించి యాపిల్‌ సరికొత్త ఫీచర్లను ప్లాన్‌ చేస్తోంది. చూపు, వినికిడి లోపాలకు తోడు కదలడానికి వీలు లేని వ్యక్తులకు ఇవి ఉపయోగపడతాయి. సైన్‌టైమ్‌ పేరిట ఈ సర్వీసును ఉనికిలోకి

దివ్యాంగుల కోసం యాపిల్‌ ఫీచర్లు

దివ్యాంగులను ఉద్దేశించి యాపిల్‌ సరికొత్త ఫీచర్లను ప్లాన్‌ చేస్తోంది. చూపు, వినికిడి లోపాలకు తోడు కదలడానికి వీలు లేని వ్యక్తులకు ఇవి ఉపయోగపడతాయి. సైన్‌టైమ్‌ పేరిట ఈ సర్వీసును ఉనికిలోకి తెచ్చింది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రెంచ్‌ సైన్‌ లాంగ్వేజ్‌ల సహకారంతో యాపిల్‌ వినియోగదారులు యాపిల్‌ కేర్‌, రిటైల్‌ కస్టమర్‌ కేర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీన్ని త్వరలో ఇతర దేశాల సైన్‌ లాంగ్వేజ్‌లతోనూ అనుసంధానం చేసే పనిలో ఉంది.  


యాపిల్‌ వాచ్‌: వాచ్‌ఓ

ఎ్‌సకు ‘అసిస్టెవ్‌ టచ్‌’తో విడుదల చేస్తోంది. అవయవాల లోపం ఉన్న వ్యక్తులు అసెస్టివ్‌ టచ్‌ సహకారంతో నేవిగేట్‌ చేయవచ్చు. డిస్‌ప్లే, కంట్రోల్స్‌ను టచ్‌ చేయకుండానే తమ పని సాగించవచ్చు.  ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కూడా తీసుకోవచ్చు. నోటిఫికేషన్‌ యాక్సెస్‌ సహా ఆన్‌స్ర్కీన్‌ మోషన్‌ పాయింటర్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. 


ఐపాడ్‌: కేవలం కళ్ళు ఉపయోగించి మూడో పార్టీ ఐ ట్రాకింగ్‌ డివైజెస్‌లను కంట్రోల్‌ చేసుకోవచ్చు. 


ఇతర ఫీచర్లు: వాయి్‌సఓవర్‌ ఫీచర్‌ను మరింతగా పెంచడం ద్వారా అంధులు, తక్కువ చూపు ఉన్న వ్యక్తులు ఇమేజ్‌ల ద్వారానే వివరాలను తెలుసుకోగలుగుతారు. పర్సన్‌ పొజిషన్‌కు తోడు ఇమేజ్‌లోని ఇతర వివరాలను వాయిస్‌ ఓవర్‌ లోతుగా వర్ణిస్తుంది. తద్వారా ఆయా వ్యక్తులతో మమేకం కావచ్చు.


బై-డైరెక్షనల్‌ హియరింగ్‌ ఎయిడ్స్‌తో వినికిడి లోపం ఉన్న వారికి సదుపాయంగా ఉంటుంది. వాటిలోని మైక్రోఫోన్లు సహాయంతో ఫేస్‌టైమ్‌ సంభాషణలు జరుపవచ్చు. 

ఆడియోగ్రామ్స్‌ గుర్తించేందుకు కూడా కంపెనీ తోడ్పడుతోంది. పీడీఎఫ్‌ ఆడియోగ్రామ్స్‌ ద్వారా వినికిడి లోపం ఉన్న వ్యక్తులు స్పష్టంగా కస్టమరైజ్‌ చేసుకునే వీలు ఉంటుంది. 

సముద్ర ఘోష, వానపడుతున్నప్పుడు శబ్దం వంటివి స్పష్టంగా తెలుసుకునేలా బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్స్‌ను కూడా యాపిల్‌ పరిచయం చేసింది. పాప్‌, ఈఈని క్లిక్‌ చేయడం ద్వారా మాట్లాడలేని వారికి, అంతంత మాత్రం నడిచే వ్యక్తులకు తోడ్పడుతుంది.

యాప్‌ బై యాప్‌ కస్టమరైజేషన్‌ ద్వారా కంటిచూపుతో ఇబ్బంది పడుతున్న వారికి సహకరిస్తోంది. 

ఆక్సిజన్‌ ట్యూబ్‌తో వినియోగదారులు వంటి కొత్త ఎమోజీలను కూడా పరిచయం చేసింది. 

Updated Date - 2021-05-22T09:00:16+05:30 IST