ఆ యువకుల ‘యాపిల్’ కథ!

ABN , First Publish Date - 2021-07-11T08:23:10+05:30 IST

భూమ్మీద మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అంటారు. అందులోనూ యువకులు తల్చుకున్నారంటే కచ్చితంగా..

ఆ యువకుల ‘యాపిల్’ కథ!

ఇంటర్నెట్ డెస్క్: భూమ్మీద మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అంటారు. అందులోనూ యువకులు తల్చుకున్నారంటే కచ్చితంగా ఆ పని అది సాధించి తీరాల్సిందే. తాజాగా మణిపూర్‌కు చెందిన కొందరు యువకులు అలాంటి ఓ అసాధ్యాన్నే సుసాధ్యం చేసి చూపించారు. లాభదాయకమైన యాపిల్ పంట సాగుకు తమ భూములు సహకరించవని వారికి తెలుసు. కానీ పట్టుదలతో, నూతన సాగు విధానాలతో యాపిల్ సాగు చేశారు. రాష్ట్రంలోనే అద్భుతమైన రైతులుగా గర్తింపు పొందారు. మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాకు చెందిన యువ రైతులు ఈ ఘన సాధించారు. దేశ చరిత్రలోనే తొలిసారి ఉఖ్రున్ జిల్లాలో యాపిల్ పంట సాగు చేసి వార్తల్లోకెక్కిరు.



చాలా తక్కువ దిగుబడి, డిమాండ్ కారణంగా ఉఖ్రుల్ జిల్లాలో యాపిల్ పంటను రైతులు సాగు చేసేవారు కాదు. అయితే ఇదే జిల్లాకు చెందిన కొందరు యువ రైతులు రింగ్‌ఫామి తింగ్‌షుంగ్, సోమయో కషుంగ్, సందోష్ హోరమ్ ఎలాగైనా రాష్ట్రంలో యాపిల్ పంటను పండించాలని నిర్ణయించుకున్నారు.


యాపిల్ తోటలు వేసి ఎంతో కష్టమీద వాటిని కాపాడారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మొక్కలను పెంచారు. సాధారణంగా విపరీతంగా మంచు కురిసే చల్లని ప్రాంతాల్లో యాపిల్ పండుతుంది. అయితే, తక్కువ చల్లదనంలోనూ పెరిగే అన్నా, డోర్సెట్ గోల్డెన్, సన్ ఫుజి వంటి యాపిల్ రకాలను వీరు ఎంపిక చేసుకున్నారు. యాపిల్ సాగులో విజయం సాధించారు.


2019లో హిమాచల్ ప్రదేశ్‌లో యాపిల్ సాగుపై జరిగిన వర్క్‌షాప్‌‌లో ఉఖ్రుల్ జిల్లాకు చెందిన సుమారు 20 మంది యువకులు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామాల్లో యాపిల్ సాగును మరింత విస్తృతం చేయడానికి పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నార్త్ ఈస్టరన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్ జరిగింది. అయితే ఈ ఇక్కడ మెళకువలను నేర్చుకున్న సదరు యువకులు యాపిల్ సాగును చేపట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

Updated Date - 2021-07-11T08:23:10+05:30 IST