Abn logo

ఆపిల్‌ హల్వా

కావలసిన పదార్థాలు: ఆపిల్స్‌- నాలుగు, నెయ్యి- నాలుగు స్పూన్లు, జీడిపప్పు పలుకులు- 8, చక్కెర- పావు కప్పు, కేసరి రంగు, యాలకుల పొడి- పావు స్పూను, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌- స్పూను.


తయారుచేసే విధానం: ఆపిల్‌ను తురుముకోవాలి. ఓ పాన్‌లో నెయ్యి వేసి, జీడిపలుకులను వేయించి పక్కన పెట్టాలి. మిగతా నెయ్యిలో ఆపిల్‌ను తురుమును వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. ఆ తరవాత చక్కెర, కేసరి వేసి బాగా కలపాలి. చక్కెరంతా కరిగి హల్వా అంతా దగ్గరయ్యాక వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, యాలకుల పొడి, జీడిపుప్పు పలుకులు కలిపితే ఆపిల్‌ హల్వా రెడీ.

చాక్లెట్‌ మోదకంకొబ్బరి సేమియా పాయసండబల్‌ కా మీఠాఅప్రికాట్‌ పుడ్డింగ్‌కద్దు కా హల్వాఅనోకీ ఖీర్‌పాల పోహాగోధుమ లడ్డుalmond, బేసన్‌ లడ్డూఇన్‌స్టెంట్‌ కలాఖండ్‌
Advertisement