అమ్మే ప్రతీ మూడు స్మార్ట్‌వాచీల్లో ఒకటి యాపిల్‌

ABN , First Publish Date - 2021-05-29T08:42:10+05:30 IST

గ్లోబల్‌ స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్‌లో యాపిల్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. అమ్మకాలు జరుగుతున్న ప్రతి మూడు వాచీలో ఒకటి యాపిల్‌ ప్రొడక్టే. ఈ ఏడాది జనవరి

అమ్మే ప్రతీ మూడు స్మార్ట్‌వాచీల్లో ఒకటి యాపిల్‌

గ్లోబల్‌ స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్‌లో యాపిల్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. అమ్మకాలు జరుగుతున్న ప్రతి మూడు వాచీలో ఒకటి యాపిల్‌ ప్రొడక్టే. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు జరిగిన వాచీల అమ్మకాలపై సర్వే చేసిన ‘కౌంటర్‌ పాయింట్‌’ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతకుమునుపు ఏడాదితో పోల్చుకుంటే  యాపిల్‌ కొత్త సిరీ్‌సకు 50 శాతం పెరుగుదల కనిపించింది. యాపిల్‌ మార్కెట్‌ షేర్‌లో మూడు శాతం పాయింట్లుపెరుగుదల నమోదైంది.


గెలాక్సీ3, గెలాక్సీ ఆదరణ  పొందడంతో శాంసంగ్‌ షిప్‌మెంట్‌ 27 శాతం పెరుగుదల చూపింది. యాపిల్‌ వాచీ ఔస్‌ ఒక్కటే సంబంధిత ప్రపంచ మార్కెట్‌లో మూడో వంతు ఆక్రమించింది. గూగుల్‌ వేర్‌ఔస్‌ ఇంకా తన మార్కెట్‌ను సుస్థిరపర్చుకోలేదు. అయితే శాంసంగ్‌తో తాజాగా జతకలిపిన నేపథ్యంలో గూగుల్‌ వాచీల అమ్మకాల ట్రెండ్‌లో మార్పు కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-05-29T08:42:10+05:30 IST