యాపిల్‌ పాలసీ మార్పు

ABN , First Publish Date - 2021-02-06T05:54:46+05:30 IST

యాప్‌ స్టోర్‌ మార్గదర్శకాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. యాపిల్‌ స్టోర్‌ ఐఓఎస్‌లో ఏరకమై యాప్స్‌ ఉంటాయో ఈ కొత్త

యాపిల్‌ పాలసీ మార్పు

యాప్‌ స్టోర్‌ మార్గదర్శకాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. యాపిల్‌ స్టోర్‌ ఐఓఎస్‌లో ఏరకమై యాప్స్‌ ఉంటాయో ఈ కొత్త పాలసీ స్పష్టం చేస్తోంది. డెవలపర్‌ పోర్టల్‌లో ఈ సమాచారం ఉంటుంది. 


యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న లేదా వినియోగించుకుంటున్న వ్యక్తికి  ప్రైవసీడేటాతో సహా యాప్‌కు సంబంధించిన సమస్త సమాచారం తప్పనిసరిగా తెలియాలి అని ఈ కొత్తపాలసీలో స్పష్టం చేసింది. యాప్‌ డిస్ర్కిప్షన్‌, స్ర్కీన్‌షాట్స్‌, ప్రివ్యూస్‌ వాస్తవాన్ని ప్రతిబింబించాలన్నది ఈ పాలసీ మార్పులో కీలకం. 


వినియోగదారుడి కార్యకలాపాలను ట్రాక్‌ చేయాలంటే మొదట వారి నుంచి పర్మిషన్‌ పొందాల్సిందే.  యాప్‌ స్టోర్‌లో మద్యం, పొగాకు లేదంటే అనుచిత మత్తు పదార్థాల అమ్మకాలు సాగించే యాప్‌లకు చోటు ఉండదు.  నిషేధిత వస్తువులు ముఖ్యంగా మైనర్లు కొనుగోలు చేయాలనుకుంటే తిరస్కరించాలని కొత్త పాలసీలో యాపిల్‌ పేర్కొంది. 

Updated Date - 2021-02-06T05:54:46+05:30 IST