యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌ ధర రూ.1900

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

మాక్‌బుక్‌ ప్రో యూజర్ల కోసం యాపిల్‌ కొత్తగా పాలిషింగ్‌ క్లాత్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మైక్రోఫైబర్‌తో కూడిన ఈ గుడ్డముక్క...

యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌ ధర రూ.1900

మాక్‌బుక్‌ ప్రో యూజర్ల కోసం యాపిల్‌ కొత్తగా పాలిషింగ్‌ క్లాత్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మైక్రోఫైబర్‌తో కూడిన ఈ గుడ్డముక్క ధర రూ.1900. సాధారణంగా హై ఎండ్‌ విండోస్‌ లాప్‌టా్‌పను కొనుగోలు చేసినప్పుడు వాటితోపాటు మైక్రోఫైబర్‌ క్లాత్‌ ఉచితంగా లభిస్తోంది. అయితే యాపిల్‌ మాత్రం తాను తయారు చేసిన పాలిషింగ్‌ క్లాత్‌ను విడిగా విక్రయిస్తోంది. సాఫ్ట్‌, నాన్‌ అబ్రెసివ్‌ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ క్లాత్‌ నానో టెక్చర్‌ గ్లాస్‌తో సహా యాపిల్‌ డిస్‌ప్లేను సురక్షితంగా, చక్కగా శుభ్రపరుస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో రూ.100కే లభిస్తున్న ఇతర మైక్రోఫైబర్‌ క్లాత్‌తో పోల్చితే ఈ పాలిషింగ్‌ క్లాత్‌కు ఉండే ప్రత్యేకత ఏమిటో యాపిల్‌ వివరించలేదు. కాగా, ఇటీవల యాపిల్‌ 14, 16 ఇంచుల వేరియంట్లలో మాక్‌బుక్‌ ప్రో లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.1,94,000, రూ.2.39 లక్షలు. 

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST