ఈ ఫోన్ పనిచేయదు! మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాం: యాపిల్ కంపెనీ వార్నింగ్

ABN , First Publish Date - 2020-06-05T00:35:35+05:30 IST

ఈ అల్లర్ల నేపథ్యంలో అనేక యాపిల్ ఫోన్లు అపహరణకు గురయ్యాయి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో యాపిల్ కంపెనీ ఈ ఫోన్లకు ‘మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాం’ అనే సందేశం పంపుతున్నట్టు తెలిసింది.

ఈ ఫోన్ పనిచేయదు! మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాం: యాపిల్ కంపెనీ వార్నింగ్

వాషింగ్టన్: శ్వేతజాత్యహంకారానికి వ్యతిరేకంగా అమెరికాలో ఐ కాంట్ బ్రీత్ నిరసనలు ఉవ్వెత్తున ఎగసిన విషయం తెలిసిందే. అనేక నగరాల్లో ఈ ఆవేదన హింసాత్మక రూపం దాల్చింది. కొన్ని చోట్ల షాపులు లూటీకి గురయ్యాయి. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్‌కు చెందిన స్టోర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అల్లర్ల నేపథ్యంలో అనేక యాపిల్ ఫోన్లు అపహరణకు గురయ్యాయి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో యాపిల్ కంపెనీ ఈ ఫోన్లకు ‘మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాం’ అనే సందేశం పంపుతున్నట్టు తెలిసింది. తస్కరణకు గురైన ఫోన్లను పనిచేయకుండా చేశామని, ఈ ఫోన్ లోకేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు స్థానిక పోలీసులకు అందిస్తున్నామని నోటిఫికేషన్లు పంపిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై సదరు సంస్థ మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.  

Updated Date - 2020-06-05T00:35:35+05:30 IST