23న ముంబైలో ఆపిల్‌ స్టోర్‌ ఓపెన్‌

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

ముంబైలో ఆపిల్‌ ఆన్‌లైౖన్‌ స్టోర్‌ ‘ఫుల్‌ సూట్‌’ ఈ నెల 23న ఆరంభం కానుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఈ

23న ముంబైలో  ఆపిల్‌ స్టోర్‌ ఓపెన్‌

ముంబైలో ఆపిల్‌ ఆన్‌లైౖన్‌ స్టోర్‌ ‘ఫుల్‌ సూట్‌’ ఈ నెల 23న ఆరంభం కానుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఈ స్టోర్‌ని ప్రారంభిస్తోంది. నిజానికి ఆపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్స్‌ 33 సంవత్సరాల క్రితమే ఆరంభమయ్యాయి.

అయితే మన దేశంలో ఇదే మొదటిది. కస్టమైజేషన్‌, ప్యాకేజింగ్‌, కౌన్సెలింగ్‌ సెషన్స్‌ వంటి సదుపాయాలన్నీ ఇకపై మన దేశంలోనే అందుబాటులో ఉంటాయి. దేశంలోని పదమూడు వేల ప్రాంతాల్లోని కస్టమర్లకు 24 నుంచి 72 గంటల్లోగా ప్రొడక్ట్‌లను అందించేందుకు ఆపిల్‌ ఇప్పటికే ‘బ్లూ డార్ట్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. 

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST