Apple: ఆ ఉద్యోగులు రోజూ టెస్ట్ చేయించుకోవాల్సిందే...

ABN , First Publish Date - 2021-10-22T02:13:27+05:30 IST

టెక్ దిగ్గజం యాపిల్ ఉద్యోగులకు ఇది కొంత చేదువార్తే. కరోనా టీకా వేయించుకోని ఉద్యోగులు

Apple: ఆ ఉద్యోగులు రోజూ టెస్ట్ చేయించుకోవాల్సిందే...

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఉద్యోగులకు ఇది కొంత చేదువార్తే. కరోనా టీకా వేయించుకోని ఉద్యోగులు ఇకపై ఆఫీసుకు వచ్చే ప్రతిసారి కరోనా టెస్టు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 24 నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. వ్యాక్సినేషన్ వివరాలు సమర్పించేందుకు నిరాకరించిన ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. వ్యాక్సినేషన్ పూర్తయిన ఉద్యోగులు మాత్రం వారానికి ఒకసారి ర్యాపిడ్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.


రిటైల్ స్టోర్ ఉద్యోగులు ప్రతి రోజూ పరీక్ష చేయించుకోవడానికి బదులు వారానికి రెండుసార్లు చేయించుకోవాలని కోరుతామని యాపిల్ తెలిపింది. అక్టోబరు 24వ తేదీ లోపు వ్యాక్సినేషన్ వివరాలు సమర్పించాలని ఉద్యోగులను ఆదేశించింది. మున్ముందు రోజుల్లో వారు తమ ఆధారాలను కూడా చూపించాలని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొంది.   

Updated Date - 2021-10-22T02:13:27+05:30 IST