కేజీబీవీలో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-07-14T10:19:51+05:30 IST

కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ..

కేజీబీవీలో ప్రవేశానికి దరఖాస్తులు

గంగివలస (పోలాకి), జూలై 13:  కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  పాఠశాల ప్రత్యేకాధికారి ఎం.సూర్యకళ తెలిపారు. సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. ఐదో తరగతి ఉత్తీర్ణురాలైన బాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈ నెల 23వ తేదీలోగా నమోదు చేసుకోవచ్చన్నారు.  ఇతర వివరాలకు 6302083049 నెంబరులో తెలుసుకోవాలన్నారు.

Updated Date - 2020-07-14T10:19:51+05:30 IST