31దాకా ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు అర్జీలు

ABN , First Publish Date - 2021-01-21T06:44:22+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాల కోసం షెడ్యూల్డ్‌ కులాల నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు

31దాకా ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు అర్జీలు

నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు: కొప్పుల ఈశ్వర్‌


హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాల కోసం షెడ్యూల్డ్‌ కులాల నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. దరఖాస్తులు చేసుకోవడానికి జనవరి 21 వరకు ఉన్న గడువును 31 వరకు పెంచామని ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు రుణాలు ఇస్తున్నామన్నారు. ఎస్సీలలోని పేద రైతులు వ్యవసాయ భూముల అభివృద్ధి, మైనర్‌ ఇరిగేషన్‌, విద్యుత్‌ లైన్లు, కనెక్షన్ల ఏర్పాటుకు కార్పొరేషన్‌ ద్వారా నేరుగా రుణాలు పొందవచ్చన్నారు.  

Updated Date - 2021-01-21T06:44:22+05:30 IST