బెస్ట్‌ అవలైబుల్‌ స్కీంకు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-22T05:29:51+05:30 IST

2021-22 విద్యాసంవత్సరానికి బెస్ట్‌ అవలైబు ల్‌ స్కీం క్రింద పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల కార్యాలయ నిర్వహకులు తెలిపారు. ఒకటవ తరగతిలో డే స్కాలర్‌గా ఇంగ్లీష్‌ మీడియంలో 27 సీట్లు, 5వ తరగతలో రెసిడెన్షియ ల్‌ ఇంగ్లిషు మీడియంలో 27సీట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

బెస్ట్‌ అవలైబుల్‌ స్కీంకు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డిటౌన్‌, జూన్‌ 21: 2021-22 విద్యాసంవత్సరానికి బెస్ట్‌ అవలైబు ల్‌ స్కీం క్రింద పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల కార్యాలయ నిర్వహకులు తెలిపారు. ఒకటవ తరగతిలో డే స్కాలర్‌గా ఇంగ్లీష్‌ మీడియంలో  27 సీట్లు, 5వ తరగతలో రెసిడెన్షియ ల్‌ ఇంగ్లిషు మీడియంలో 27సీట్లు మాత్రమే  ఉన్నాయని తెలిపారు. దరఖాస్తు ఫారములు జూలై 8 వరకు కార్యాలయ పనివేళలో కలెక్టర్‌ కాం ప్లెక్స్‌లో పొందవచ్చని తెలిపారు. ఒకటవ తరగతిలో ప్రవేశానికి బాల, బాలికలు జూన్‌ 1, 2015 నుంచి మే 31, 2016 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. కామారెడ్డి అర్బన్‌ ఏరియాలో రూ.2లక్షలు, రూరల్‌ ఏరియాలో రూ.1లక్ష 50వేల ఆదాయానికి మించరాదని తెలిపారు. జూలై 8లోగా దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. జూలై 14న మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాస్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో లాటరీ పద్దతిన ఎంపిక చేస్తారని తెలిపారు.

Updated Date - 2021-06-22T05:29:51+05:30 IST