వలంటీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2021-05-17T04:39:34+05:30 IST

మండలంలో వివిధ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న వలంటీర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో శివయ్య ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

వలంటీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

తడ,  మే 16 : మండలంలో వివిధ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న వలంటీర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో శివయ్య ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. 10వ తరగతి పాసై 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  ఖాళీల వివరాలను పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోల నుంచి తెలుసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 21న పరిశీలిస్తామని, 22 నుంచి 24వ తేదీ వరకు అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Updated Date - 2021-05-17T04:39:34+05:30 IST