Abn logo
Oct 22 2021 @ 00:19AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించాలి

ధర్నా చేపట్టిన కేవీపీఎస్‌ శ్రేణులు

- కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల కుర్మయ్య


పాలమూరు, అక్టోబరు 21 : ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించాలని కేవీపీ ఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల కుర్మయ్య డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రం లోని తెలంగాణ చౌరస్తాలో ఎస్సీ కార్పొరే షన్‌లో రెండేళ్ల రుణాల యాక్షన్‌ప్లాన్‌ విడుదల చేయాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఏకకాలంలో 53వేల కుటుంబాలకు దళితబంధు అమ లు చేయాలని డిమాండ్లతో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశా రు. స్థానికంగా ఉన్న జిల్లా యంత్రాంగం పట్టించుకోవటంలేదన్నారు. దళితులకు జీ.వో నెం. 342 ప్రకారం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేయాలని కోరారు. కార్యక్ర మంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పరశురాం, యం.రాజు, లక్ష్మీదేవి, రాములు, బాలరాజు, నాగరాజు, గురుమూర్తి, కాశీం, చెన్నయ్య పాల్గొన్నారు. 


‘కార్మికులకు 11వ పీఆర్సీ అమలు చేయాలి’


బాదేపల్లి, అక్టోబరు 21 : మునిసిపల్‌, గ్రామ పంచాయతీలలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. జడ్చర్ల మునిసి పాలిటీ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన మునిసిపల్‌ కార్మికుల సాధారణ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులతో వెట్టిచాకిరి చేయిం చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్‌ బిశ్వాల్‌ కమిటీ సూచించిన వి ధంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. జడ్చర్ల మునిసిపాలిటీలో పారిశుధ్య విభాగంలో విధు లు నిర్వహిస్తున్న కార్మికులపై మునిసిపల్‌ అధికారులు వేధిస్తున్నారని, అనారోగ్యం పాలైన కార్మికులకు సెలవులు అమలు చేయకుండా, ఆరోగ్యం బాగుపడిన అనంతరం విధుల్లోకి వచ్చిన వారిని విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను వేధిస్తే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటేశ్‌, పట్టణ కమిటీ అధ్యక్షుడు కృష్ణ, సీఐటీ యూ నాయకులు కురుమూర్తి, జగన్‌, తెలుగు సత్తయ్య, యూనియన్‌ స్థానిక నాయకులు విద్యాసాగర్‌, రవి, భీంరాజ్‌, శ్రీను, భారతి, పార్వతమ్మ, యాదమ్మ, శంకర్‌, కళమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. 


వికలాంగుల బంధు పథకాన్ని చేపట్టాలి


- ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య


మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 21 : దళిత బంధు లాగే వికలాంగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల బంధు పథకాన్ని అమలు చేయాలని విక లాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌.పి.ఆర్‌.డి.) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్‌ చేశారు. ఈ పథకం కోసం నవంబరు 15న రాష్ట్ర వ్యా ప్తంగా అన్నిజిల్లాల కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన వికలాంగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకా ల్లో వికలాంగులకు అధనంగా 25 శాతం చెల్లించాలని 2016 వికలాంగుల పరిర క్షణ చట్టం తెలిపిందని అన్నారు. రాష్ట్రంలో వికలాంగులపై వేధింపులు అధికమ య్యాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో మృతి చెందిన కార్తీక్‌ గౌడ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛ న్లు వెంటనే మంజూరు చేయాలని, వికలాంగుల హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని, ఉద్యోగాల నియామకాలలో 4శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలో 5 శాతం వికలాంగులకు కేటాయించాలని కోరారు. తీవ్ర అంగవైకల్యం ఉన్న వారి సహాయకులకు అలవెన్సులు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు 150 రోజులు పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు టి. మధుబాబు, నాగర్‌ కర్నూలు జిల్లా కార్యదర్శి పి.బాలీశ్వర్‌, నారాయణపేట జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు కాశప్ప, రాధమ్మ, మొగులయ్య, శ్రీనివాస్‌, స్వామి, ఆంజనేయిలు, వాల మ్మ, కతాలు, బాబు, బాబురవి, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.