వర్సిటీల్లో ఈసీ సభ్యుల నియామకాలు అక్రమం

ABN , First Publish Date - 2020-09-25T08:09:35+05:30 IST

విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(క్లాస్‌-2) సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 23న జారీ చేసిన

వర్సిటీల్లో ఈసీ సభ్యుల నియామకాలు అక్రమం

ఆ జీవోలను రద్దు చేయండి: హైకోర్టులో పిల్‌ 


అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(క్లాస్‌-2) సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 23న జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విశాఖకు చెందిన ఎన్‌.నిమ్మీగ్రే్‌స ఈ పిల్‌ వేశారు. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా, ఏకపక్షంగా ఈ నియామకాలు జరిగాయని ఆరోపించారు.


ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం- 1991లోని సెక్షన్‌ 18 నిబంధనలను ప్రభుత్వం పాటించలేదన్నారు. ఈ పదవులకు కనీసం దరఖాస్తు చేయనివారిని కూడా సభ్యులుగా ఎంపిక చేశారన్నారు. సీఎస్‌, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ విద్యామండలి చైర్మన్‌తో పాటు మొత్తం 51మంది వర్శిటీల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (క్లాస్‌2) సభ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-25T08:09:35+05:30 IST