పనితీరుకు ప్రశంస

ABN , First Publish Date - 2021-06-20T05:46:30+05:30 IST

హిందూపురం సెబ్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ లక్ష్మీదుర్గయ్యకు రాష్ట్రస్థాయిలో ప్రశంసాపత్రం అందుకున్నారు.

పనితీరుకు ప్రశంస
ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్న సీఐ లక్ష్మీదుర్గయ్య

- సెబ్‌ సీఐకు రాష్ట్రస్థాయి గుర్తింపు

- పంచలింగాల చెక్‌పోస్టులో కష్టానికి ఫలితం 

 హిందూపురం, జూన 19: హిందూపురం సెబ్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ లక్ష్మీదుర్గయ్యకు రాష్ట్రస్థాయిలో ప్రశంసాపత్రం అందుకున్నారు. గతవారం కర్నూల్‌ జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు నుంచి హిందూపురం సెబ్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌గా బదిలీ అయ్యారు. అయితే ఈయన పంచలింగాల చెక్‌పోస్టులో 2020జూన1 నుంచి ఈ యేడాది జూన 14 వరకు విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో చేపట్టిన తనిఖీల్లో 722 మందిని అరె్‌స్టచేసి 398 వాహనాలను సీజ్‌ చేయించారు. అదే విధంగా 179 కేజీల గంజాయిని, 1,08,089 ప్యాకెట్ల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా రూ.10,21,98,000నగదును స్వాధీనంచేసుకున్నారు. 213.250 కేజీల వెండి, 22.543 కేజీల బంగారంను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో లక్ష్మీదుర్గయ్య ప్రత్యేక ప్రతిభ కనబరచినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందులో ఇటీవ ల తమిళనాడులో జరిగిన ఎన్నికలకు ఓ పార్టీ నాయకుడికి తీసుకెళ్తున్న నగదును పట్టుకోవడంలో సీఐ చూపిన చొరవ అభినందనీయమని ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే సెబ్‌లో పనిచేస్తున్న జిల్లాస్థాయిలో అదనపు ఎస్పీలకు మాత్రమే ప్రశంసాపత్రాలు అందించారు. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్న చెక్‌పోస్టుగా పంచలింగాల చెక్‌పోస్ట్‌ అధికారిగా లక్ష్మీదుర్గయ్యను ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రశంసాపత్రాన్ని స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినితబ్రెజిలాల్‌, కర్నూలు జిల్లా స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ గౌతమ్‌శాలికి పంపగా దానిని సెబ్‌ సీఐ లక్ష్మీదుర్గయ్యకు శనివారం అందజేసినట్లు తెలిపా రు. ఈ ప్రశంసాపత్రం తనకు మరింత బాధ్యత పెంచిందని సీఐ పేర్కొన్నారు. 



Updated Date - 2021-06-20T05:46:30+05:30 IST