‌చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం

ABN , First Publish Date - 2021-04-14T05:51:01+05:30 IST

వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయమని లింగసముద్రం ఎస్సై ఎస్‌.రమేష్‌ చెప్పారు.

‌చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్సై రమేష్

లింగసముద్రం, ఏప్రిల్‌ 13 : వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయమని లింగసముద్రం ఎస్సై ఎస్‌.రమేష్‌ చెప్పారు. లింగసముద్రంలోని ఆటోడ్రైవర్లు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక కల్యాణ మండపం సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఎస్సై రమేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్‌ మాట్లాడుతూ చలివేంద్రంలో మినరల్‌ వాటర్‌ అందుబాటులో ఉంటుందని ఆటో డ్రైవర్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిబాలకోటయ్య, షేక్‌ షఫీ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఆధ్వర్యంలో...

పామూరు, ఏప్రిల్‌ 13: వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఎంతాగానో దోహదపడతాయని పంచాయతీ ఉపసర్పంచ్‌ యా దాల సాయి కిరణ్‌ అన్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో పట్టణంలో పలుచోట్ల చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేసి మంగళవారం వాటిని ప్రారంభించారు. నీటిని వృథా చేయకుండా చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు జి.హుస్సేన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, సింగిల్‌ విండో చైర్మన్‌ చల్లా సుబ్బారావు, కందుల శ్రీనివాసరెడ్డి, గట్లా విజయభాస్కర్‌రెడ్డితో పాటు వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T05:51:01+05:30 IST