Abn logo
Apr 1 2021 @ 08:02AM

ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా మొదలయ్యింది?

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు(ఏప్రిల్ 1) ఏప్రిల్ ఫూల్స్ డే నిర్వహిస్తుంటారు. ఈ రోజు స్నేహితులు, కుటుంబ సభ్యులను వివిధ రకాలుగా ఫూల్స్ చేసి ఆనందిస్తుంటారు. కొన్ని దేశాలలో ఏప్రిల్ ఫూల్స్ డే రోజున సెలవు కూడా ఇస్తుంటారు. ఈరోజు ఒకరిపై మరొకరు జోక్స్ వేసుకుంటూ ఆనందిస్తుంటారు. అయితే దీనిని ఎవరూ తప్పుగా భావించరు. ఇక ఏప్రిల్ ఫూల్స్ డే‌కి ఉన్న చరిత్ర విషయానికొస్తే, దీనికి సరైన ఆధారాలు లభించడం పోవడం విశేషం. అయితే ఏప్రిల్ ఫూల్స్ డేకు సంబంధించిన కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. 

ఏప్రిల్ ఫూల్స్ డే 1392 నుంచి నిర్వహిస్తున్నట్లు చెబుతారు. అయితే ఫ్రాన్స్‌లో 1582 నుంచి ఏప్రిల్ ఫూల్స్ డే చేసుకుంటున్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అప్పట్లో పోప్ చార్ల్స్-9 పాత క్యాలెండర్ స్థానంలో నూతన రోమన్ క్యాలెండర్ తీసుకువచ్చారట. దీంతో జనం పాత తేదీపై నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారట. దీనినే తొలి ఏప్రిల్ ఫూల్‌గా చెబుతుంటారు. ఏప్రిల్ ఫూల్స్ డేను ప్రపంచంలోని వివిధ దేశాలలో పలు రకాలుగా జరుపుకుంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, బ్రిటన్‌లలో ఏప్రిల్ ఫూల్స్‌డేను మధ్యాహ్నం వరకే చేసుకుంటారు. ఆయా దేశాల్లోని వార్తా పత్రికల్లోని తొలి పేజీల్లో ఏప్రిల్ పూల్స్ డే సంబంధిత వార్తలను ప్రచురిస్తారు. ఇదేవిధంగా ఫ్రాన్స్, ఐర్లాండ్, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, రష్యా, నెదర్లాండ్, జర్మనీ, బ్రెజిల్, కెనడా, అమెరికాతో పాటు పలు దేశాలలో ఏప్రిల్ ఫూల్స్ డే ఎంతో ఆనందకరంగా చేసుకుంటారు. ఇటలీ, బెల్జియం దేశాలలో ఏప్రిల్ ఫూల్స్ డే నాడు స్నేహితుల వీపు భాగాన... ఫన్నీ కామెంట్లతో కూడిన పేపర్లు అతికిస్తారు. అలాగే కాగితంతో తయారు చేసిన ఫిష్ లను కూడా అతికిస్తారు. వీటిని ఏప్రిల్ ఫిష్‌గా పిలుస్తుంటారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement