సమస్యల పరిష్కారానికి ఉద్యమం

ABN , First Publish Date - 2021-10-18T05:03:48+05:30 IST

ప్రభుత్వ ఇచ్చిన హామీలు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు తప్ప మరోమార్గం లేదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగవరప్రసాద్‌ పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారానికి ఉద్యమం
మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పాండురంగవరప్రసాద్‌

19 నుంచి విజయవాడలో ధర్నాలు

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్‌

గుంటూరు(విద్య),అక్టోబరు 17: ప్రభుత్వ ఇచ్చిన హామీలు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు తప్ప మరోమార్గం లేదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగవరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులోని ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు.  ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19 నుంచి విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.బసవలింగారావు, సయ్యద్‌చాంద్‌ బాషా, జిల్లా కార్యదర్శి మక్కెన శ్రీనివాస్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ ఖాలీద్‌, బొర్రా శ్రీనివాసరావు, రాంబాబు, లక్ష్మయ్య, బాలకృష్ణ, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T05:03:48+05:30 IST