Advertisement
Advertisement
Abn logo
Advertisement

2న ఏపీయూఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ధర్నా

గుంటూరు(విద్య), నవంబరు 30: సుదీర్ఘకాలంలో అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం(ఏపీయూఎస్‌) ఆధ్వర్యంలో ఈనెల 2న విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి దారపనేని శ్రీనివాసరావు వెల్లడించారు. ఈమేరకు మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. సీపీఎస్‌ రద్దు, డీఏల మంజూరు, పీఆర్‌సీ అమలు, పదవీ విరమణ చెల్లింపుల్లో జాప్యం తదితర అంశాలపై ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 


Advertisement
Advertisement