ఆహ్లాదం.. ఆక్వా ఏరోబిక్స్‌!

ABN , First Publish Date - 2020-02-24T08:25:52+05:30 IST

జిమ్‌లో వ్యాయామాలు చేయడం ఆరోగ్యకరమే! అయితే ఆ వ్యాయామాల మీద ఆసక్తి తగ్గినా, శరీరం అందుకు సహకరించకపోయినా ప్రత్యామ్నాయంగా అక్వా ఏరోబిక్స్‌ ఎంచుకోవచ్చు. శరీరం మీద తక్కువ ఒత్తిడి కలిగించే ఈ వ్యాయామాలతో అలసట కూడా తక్కువే!

ఆహ్లాదం.. ఆక్వా ఏరోబిక్స్‌!

జిమ్‌లో వ్యాయామాలు చేయడం ఆరోగ్యకరమే! అయితే ఆ వ్యాయామాల మీద ఆసక్తి తగ్గినా, శరీరం అందుకు సహకరించకపోయినా ప్రత్యామ్నాయంగా అక్వా ఏరోబిక్స్‌ ఎంచుకోవచ్చు. శరీరం మీద తక్కువ ఒత్తిడి కలిగించే ఈ వ్యాయామాలతో అలసట కూడా తక్కువే! 


ఒత్తిడి తక్కువ: వ్యాయామాలతో కీళ్ల మీద ఒత్తిడి పడడం సహజం. అయితే కీళ్ల సమస్యలు, వెన్న సంబంధ ఇబ్బందులు ఉన్నవాళ్లు ఒత్తిడి తక్కువగా ఉండి, మంచి ఫలితం దక్కే వ్యాయామంగా ఆక్వా ఏరోబిక్స్‌ ఎంచుకోవచ్చు.


ఈత రాకున్నా సరే: స్విమ్మింగ్‌ పూల్‌లో చేసే ఆక్వా ఏరోబిక్స్‌ కోసం ఈత కచ్చితంగా వచ్చి ఉండాలనే నియమం లేదు. తక్కువ లోతులో నిలబడి ఈ వ్యాయామాలను తేలికగా చేసుకోవచ్చు.


శిక్షకుడి సలహా: ఆక్వా ఏరోబిక్స్‌ చేయడం తేలిక. అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉంటే, ఆ విషయాలను శిక్షకుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఏదైనా వ్యాయామం చేయలేకపోతే, వాళ్లు అంతే ప్రభావం కలిగిన ప్రత్యామ్నాయ వ్యాయామాలు సూచిస్తారు. 


దుస్తులు అనువుగా: ఆక్వా ఏరోబిక్స్‌ కోసం ధరించే దుస్తులు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ప్రత్యేకంగా ఈ వ్యాయామం కోసం ఉద్దేశించిన దుస్తులనే ఎంచుకోవాలి. అలా కాకుండా జిమ్‌కు వేసుకువెళ్లే దుస్తులు ధరిస్తే, తడి దుస్తులు ఒంటికి అతుక్కుపోయి, వ్యాయామాలు చేయడానికి అడ్డు పడవచ్చు.


వ్యాయామం తర్వాత: స్విమ్మింగ్‌ పూల్‌లో క్లోరిన్‌ కలుపుతారు. కాబట్టి వ్యాయామం పూర్తయిన వెంటనే తలస్నానం చేయాలి. నీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీళ్లలో ఎక్కువసేపు గడపడం వల్ల చర్మం పొడిబారుతుంది. కాబట్టి స్నానం చేసిన వెంటనే మన్నికైన మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి.

Updated Date - 2020-02-24T08:25:52+05:30 IST