రొయ్యకు మద్దతు కరువు

ABN , First Publish Date - 2020-04-05T08:59:53+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌తో ఆక్వా సాగు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా కొనుగోళ్లు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి.

రొయ్యకు మద్దతు కరువు

అయినకాడికి అమ్ముకుంటున్న వైనం

వ్యాన్లు, ఆటోలపై తక్కువ ధరకు అమ్మకం

అగమ్యగోచరంగా రైతుల పరిస్థితి   


కలిదిండి, ఏప్రిల్‌ 4 : కరోనా ఎఫెక్ట్‌తో ఆక్వా సాగు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా కొనుగోళ్లు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. రొయ్యలు కౌంటుకు వచ్చి పట్టుబడి చేద్దామన్నా కొనేవారు లేక రైతులు విలవిల్లాడు తున్నారు. ఆక్వా ట్రేడర్స్‌ ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరమైంది. రొయ్యల ఉత్పత్తిలో కలిదిండి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. మండలంలో 15 వేల ఎకరా ల్లో రొయ్యలు సాగు చేస్తుండగా, 10 వేల ఎకరాల్లో కౌంటుకు వచ్చి పట్టుబడికి సిద్ధంగా ఉన్నాయి. వాటి నుంచి రెండు వేల టన్నులకు పైగా రొయ్య దిగుబడి వస్తుంది. ప్రస్తుతం  100 నుంచి 120 కౌంటు రొయ్యలు అధికంగా ఉండటంతో పట్టుబ డులు చేసేందుకు రైతులు కంగారుపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు, ట్రేడర్స్‌ కొనుగోలు చేసే ధరకు పొంతన ఉండటం లేదు. దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తు న్నారు. నగదు మాత్రం మూడు నెలల తర్వాత ఇస్తామని షరతులు పెడుతున్నారని రైతులు ఆందోళన పడుతున్నారు.


 కార్మికుల కొరత

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లలో పనిచేసే కార్మికులు కరువయ్యారు. రైతులే నేరుగా ప్రాసెసింగ్‌ చేయించి అమ్మకాలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. వాతా వరణంలో మార్పు, ఉక్కపోతతో 100 కౌంటులోనే తప్ప నిసరిగా పట్టేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదే సమయంలో కొనుగోలుదారులు లేక వ్యాన్లు, ఆటోలపై కిలో రొయ్యలను రూ.100 చొప్పున విక్రయాలు చేస్తున్నారు. అయినకాడికి సొమ్ము చేసుకోవటం తప్ప వేరే దారి లేని పరిస్థితి నెలకొంది. రొయ్యల కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో నిల్వలు అధికంగా ఉండటంతోపాటు ట్రాన్స్‌పోర్టు స్తంభించింది.  


మద్దతు ధర కు కొనటం లేదు .. అండ్రాజు శ్రీనివాస్‌, ఆక్వా రైతు, మట్టగుంట

రైతులు నష్టపోకుండా ఎగుమతిదారులు కొనుగోలు చేస్తారని ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడా అమలు జరగటం లేదు. కొందరు చెరువులను పట్టినా మార్కెట్‌లో అమ్ముకోలేక వదిలేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.2లక్షలు నష్టం వస్తోంది.

 

ప్రభుత్వం ఆదుకోవాలి ..ఎన్‌.చలపతిరావు, ఎస్‌.ఆర్సీ అగ్రహారం

పట్టుబడులకు సిద్ధంగా ఉన్న రొయ్యలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా తక్షణం కొనుగోలు చేసి ఆదుకోవాలి. హెడ్‌లెస్‌ రొయ్యలను మాత్రమే కొనుగోలు చేసా ్తమని వ్యాపారులు, దళారులు డిమాండ్‌ చేస్తున్నారు. ధర సగానికి  తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. కరోనా బూచిని చూపి రైతులను నిలుపు దోపిడీ చేస్తున్నారు. 


  రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు : ఎస్పీ  

కైకలూరు : ఆక్వా రవాణాకు  ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు అన్నారు. కైకలూరులో శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఆక్వాకు  ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, రొయ్యల, చేపల పట్టుబడులకు వెళ్లే కూలీలు 10 మంది మాత్రమే వాహనాల్లో వెళ్లాలని, భౌతిక దూరాన్ని పాటిం చాలని, లేకుంటే ముప్పు తప్పదన్నారు.  గ్రామ కట్టుబాట్లు, కరోనాతో  రొయ్యలను శుభ్రం  చేసే కూలీలు రావడం లేదని, వారందరికీ అవగాహన కల్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, సరిఽహద్దుల్లో ఆక్వా రవాణాలో  ఇబ్బందులు కలిగినా స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ ధర్మేంద్రను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-04-05T08:59:53+05:30 IST