ఆక్వాకల్చర్‌ సుస్థిరతకు నూతన చట్టాలు

ABN , First Publish Date - 2021-03-03T05:51:31+05:30 IST

ఆక్వాకల్చర్‌ రంగం సమగ్ర అభివృద్ధికి, సుస్థిరతకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా కల్చర్‌ అభివృద్ధి చట్టం -2020 ప్రవేశ పెట్టినల్లు జాయింట్‌ కలెక్టర్‌(రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు

ఆక్వాకల్చర్‌ సుస్థిరతకు నూతన చట్టాలు
కలెక్టరేట్‌లో జరిగిన సదస్సులో పాల్గొన్న జేసీ దినేష్‌కుమార్‌

జేసీ(రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌

గుంటూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఆక్వాకల్చర్‌ రంగం సమగ్ర అభివృద్ధికి, సుస్థిరతకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా కల్చర్‌ అభివృద్ధి చట్టం -2020 ప్రవేశ పెట్టినల్లు జాయింట్‌ కలెక్టర్‌(రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో చేప విత్తనం, మేత చట్టాలపై ఆక్వా బిజినెస్‌ ఆపరేటర్లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జేసీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ చట్టంలో లోపాలను సూచిస్తే సవరణ చేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. ఈ చట్టం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్‌, ఫీడ్‌ ఇతర ఇన్‌పుట్స్‌ రైతులకు సకాలంలో అందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు.  మత్స్య శాఖ డీడీ డాక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ నూతన చట్టాల ద్వారా సాగుదారులు విధిగా లైసెన్సు తీసుకోవాలని, ఇప్పటికే లైసెన్సు కలిగిన వారు ఎండార్స్‌మెంట్‌ పొందాలన్నారు. జూన్‌ నాల్గో తేదీ లోపు లైసెన్సు కలిగి ఉన్న వారు విధిగా ఎండార్స్‌మెంట్‌ పొందాలన్నారు. గ్రామ సచివాలయాల్లో సాఫ్టువేర్‌ కూడా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సులో జాయింట్‌ డైరెక్టర్‌ రాఘవరెడ్డి, మత్స్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T05:51:31+05:30 IST