ఆక్వా రైతులూ ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2020-03-27T10:24:37+05:30 IST

రవాణా విషయంలో ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌

ఆక్వా రైతులూ ఆందోళన వద్దు

రొయ్యపిల్లలు, మేత రొయ్యల రవాణాకు అనుమతులు: కలెక్టర్‌


డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మార్చి 26: రవాణా విషయంలో ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్‌ మూలంగా ఆక్వా రంగానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కలెక్టర్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్‌ అధికారులకు, మత్స్యశాఖ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఆక్వా రొయ్యపిల్లల రవాణా విషయంలో ఆల్‌ ఇండియా హ్యాచరీల అసోసియేషన్‌ కాకినాడ శాఖ ద్వారా వాహనాలకు అనుమతులు మంజూరు చేస్తారన్నారు. హేచరీ యజమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రొయ్యపిల్లలను రవాణా చేసుకోవచ్చన్నారు. ఆక్వాకు సంబంధించిన రొయ్యపిల్లలు, మేత రొయ్యల రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలని పోలీసులకు సూచించారు. రొయ్యల ప్రొసెసింగ్‌ ప్లాంట్లలో పనిచేసే సిబ్బంది రవాణాకు నిబంధనలకు లోబడి వాహనాలకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. చెరువుల పట్టుబడుల విషయంలో, కూలీలను ఏర్పాటు చేసుకోవడంలో ప్రతిబంధకాలు కలిగించరాదని కలెక్టర్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఫిషరీష్‌ జేడీ పి.జయరావు పాల్గొన్నారు.


సహృదయంతో విరాళాలు..కరోనా మహమ్మారిపై పోరాటానికి పలువురు మద్దతు

సీఎం సహాయనిధికి కొందరు, జిల్లా యంత్రాంగానికి మరికొందరు.. కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు తమవంతుగా సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుండగా మరికొందరు జిల్లా యంత్రాంగానికి విరాళాలు ఇస్తున్నారు. జిల్లా యంత్రాంగానికి మంత్రి బోస్‌ రూ.లక్ష విరాళం, కరోనా ఎక్విప్‌మెంట్‌ కోసం రైస్‌మిల్లర్ల సంఘం రూ.20లక్షలు ఇవ్వగా, సీఎం సహాయనిధికి నన్నయ్య సిబ్బంది రూ.3.62లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

Updated Date - 2020-03-27T10:24:37+05:30 IST