ఓ రొయ్యో..

ABN , First Publish Date - 2022-01-22T06:02:21+05:30 IST

ఆక్వా రైతుల రైతులకు రక్షణ కల్పించేందుకు తీసుకువచ్చిన అప్సడా (ఏపీ సడా యాక్ట్‌) ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ అమలుకు రైతుల సమాచార సేకరణ సాగతీతగా మారింది.

ఓ రొయ్యో..

ఆక్వా రైతుల నమోదులో జాప్యం

ఇప్పటి వరకు నమోదైంది 30 శాతమే

2021 జనవరి నుంచి ప్రారంభం

భీమవరం, జనవరి 21 : ఆక్వా రైతుల రైతులకు రక్షణ కల్పించేందుకు తీసుకువచ్చిన అప్సడా (ఏపీ సడా యాక్ట్‌) ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ అమలుకు రైతుల సమాచార సేకరణ సాగతీతగా మారింది.  గతేడాది జనవరి నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. దీనిప్రకారం ఆక్వా సాగు రైతులు తమ వివరాలను గ్రామ సచివాలయాలలో నమోదు చేయించుకోవాలి. దీనిపై రైతుల నుంచి స్పందన కనిపించడం లేదు.  జిల్లాలో సుమారు 1.10 లక్షల మంది ఆక్వా రైతులు ఉండగా గతేడాది డిసెంబరు నాటికి 30 శాతం మంది మాత్రమే నమోదయ్యారని మత్స్యశాఖ అధికారులు చెబుతు న్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారుల వద్ద ఉన్న లెక్కల ప్రకారం 90 వేల ఎకరాల్లో రొయ్యలు, 1.60 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తు న్నట్టు గణాంకాలు న్నాయి. రొయ్యల రైతులే 30 వేల మందికి పైగా జిల్లాలో ఉన్నారు. మరో 80 వేల మంది వరకు చేపల రైతులు ఉంటారు. వీరి వివరాల సేకరణకు జిల్లాలో 1500 పైగా ఉన్న సచివాలయాల్లో 100 మంది మాత్రమే గ్రామ మత్స్యశాఖ సహాయకులు (వీఎఫ్‌ఎ) పనిచేస్తున్నారు. వీరి ద్వారానే రైతుల నమోదు ప్రక్రియ జరగవలసి ఉంది. వీరిని ఎక్కు వగా సచివాలయాల్లో పనులకు వినియోగించుకుంటున్నారని అందువల్ల రైతుల వివరాలు సేకరణ వేగవంతం అవడం లేదని అంటున్నారు.  


Updated Date - 2022-01-22T06:02:21+05:30 IST