శింబు, గౌతమ్ కార్తీక్ హీరోలుగా స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కే.ఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రం ‘పత్తుతల’. ఓబిలి ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలను సమకూర్చనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో శింబు ముఖం కనిపించకుండా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. మరో పోస్టర్లో శింబు ముఖం తెలియకుండా, ఇతర నటీనటులు ఉండేలా ముద్రించారు.
ఇదే విషయంపై నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ.. తమ చిత్రానికి రెహ్మాన్ సంగీతం సమకూర్చేందుకు సమ్మతించడం చాలా గర్వంగా భావిస్తున్నట్టు చెప్పారు. ‘జిల్లున్ను ఒరు కాదల్’, ‘నెండుజాలె’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఓబిలి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారనీ, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.