రెహమాన్‌ షేర్‌ చేశారు!

ABN , First Publish Date - 2020-04-04T06:10:15+05:30 IST

ప్రపంచమంతటా కరోనా భయాందోళనలు, నిరుత్సాహం నెలకొని ఉన్న సమయంలో సోషల్‌ మీడియాలో ఒక పాట ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. భయాందోళనలను దూరం చేస్తూ అందరూ ఒక్కటై పోరాడితే వైరస్‌పై విజయం కష్టమేమీ కాదని ప్రేరణ

రెహమాన్‌ షేర్‌ చేశారు!

ప్రపంచమంతటా కరోనా భయాందోళనలు, నిరుత్సాహం నెలకొని ఉన్న సమయంలో సోషల్‌ మీడియాలో ఒక పాట ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. భయాందోళనలను దూరం చేస్తూ అందరూ ఒక్కటై పోరాడితే వైరస్‌పై విజయం కష్టమేమీ కాదని ప్రేరణ నింపుతోంది. ‘న కరోనా కరో’... పాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ సంచలనం. పుణేకు చెందిన హిందుస్తానీ క్లాసికల్‌ సింగర్‌ సందీప్‌ రణడే పాడిన ఈ పాట ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌ రెహమాన్‌ను సైతం ఆకట్టుకుంది. ఎంతగా అంటే ఆ పాటను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి మరీ మెచ్చుకున్నాడు. నిజానికి సందీప్‌ ఈ పాట పాడే సమయానికి మనదేశంలో లాక్‌డౌన్‌ విధించలేదు. చైనాలో మాత్రం అప్పుడే వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తోంది. ఆ సమయంలో ప్రజల్లో ఒక భయం నెలకొని ఉంది. అప్పుడే ‘న కరోనా కరో’ పాటను పాడి సోషల్‌ మీడియాలో పెట్టాడు. అంతే... ప్రపంచం నలుమూలల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.


సంగీతానిదే ఆ శక్తి..

డిప్రెషన్‌ను, ఒంటరితనాన్ని దూరం చేయడానికి సంగీతం బాగా ఉపయోగపడుతుందని అంటారు సందీప్‌. విశేషం ఏమిటంటే మహదేవన్‌, పండిట్‌ అజయ్‌ పోహంకర్‌, పండిట్‌ సురేష్‌ తల్‌వాల్కర్‌, దలేర్‌ మెహందీ, అద్నాన్‌ సమీ, నానాపటేకర్‌ వంటి ప్రముఖులు సైతం సందీప్‌ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలలో సందీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ‘‘అంతటా భయాందోళనలు నెలకొన్ని ఉన్న ఈ సమయంలో ప్రజల్లో ఒక చిన్న ఆశను నిప్పు రవ్వలా రేకెత్తించాలనే ప్రయత్నంలో ఈ పాటను పాడాను. ఇప్పుడు ఆ నిప్పురవ్వ అగ్నిగోళంలా మారింది’’ అని తన మనసులో మాటను పంచుకున్నారు సందీప్‌.

Updated Date - 2020-04-04T06:10:15+05:30 IST