Abn logo
Sep 27 2021 @ 00:48AM

నన్ను పెళ్లి చేసుకుంటావా.. రూ.3.70 కోట్లు ఇస్తా.. ఓ అరబ్ షేక్ ఆఫర్.. యువతి రెస్పాన్స్ ఇదీ..

బ్రెజిల్ అందాల భామ, మోడల్ క్రిస్ గలేరా గురించి సోషల్ మీడియాలో అంతా చర్చ. ఆమె గురించి ప్రత్యేకం ఏమిటంటే.. గలేరా తనను తాను వివాహం చేసుకోవడమే. పెళ్లి కోసం మగతోడు అసలు వద్దని నిర్ణయించుకున్న ఆమె చివరకు తనను తాను వివాహం చేసుకుంది. బ్రెజిల్‌లోని సావో పోలో చర్చిలో వివాహం చేసుకోవడానికి ముందు గలేరా తీసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


33 ఏళ్ల ఈ అందాల భామ గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. కొందరు ఈమెను విమర్శిస్తున్నా.. గలేరా మాత్రం వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ ఆ నెటిజన్లలో ఒకతను మాత్రం ఆమెను అమితంగా అకట్టుకున్నాడు. అతను చేసిన కామెంట్ గలేరాకు వింతగా అనిపించింది.


ఇటీవల గలేరా ఒక అన్‌లైన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఒక అరబ్ షేక్ వివాహం చేసుకోమని వింతగా అడిగాడని చెప్పింది. గలేరా తనను తాను వివాహం చేసుకున్న విషయం తెలిసిన ఆ అరబ్ కుబేరుడు ఆమెను ముందు విచిత్ర ప్రస్తావన పెట్టాడు. ఆమె ముందు తనకు తాను విడాకులు ఇచ్చుకోవాలని సూచించాడు. అంతేనా ఆ తరువాత అతడిని గలేరా పెళ్లి చేసుకుంటే ఏకంగా అయిదు లక్షల డాలర్లు ఎదురు కట్నం ఇస్తానని ప్రస్తావించాడు. 


విచిత్రమేమిటంటే అసలు విమర్శలను ఎప్పుడూ పట్టించుకోని గలేరా సైతం అతడితో ఒకసారి మాట్లాడిందట. కానీ తన స్వేచ్ఛను వదలుకోలేనని చెప్పి ఆ అరబ్ షేక్‌కు గలేరా పెళ్లికి నో అనేసింది.

ప్రత్యేకంమరిన్ని...