Advertisement
Advertisement
Abn logo
Advertisement

104, 108 సేవలు మెరుగుపరుస్తాం

అరబిందో ఈఎంఎస్‌ సంస్థ సీఈవో పాపిరెడ్డి


పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 1 : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అత్యవసర సమయాల్లో  అరబిందో సంస్థద్వారా  వైద్య సహాయం అందిస్తున్న 104, 108 (అంబులెన్స్‌) వాహనాల్లో మరింత మెరుగైన సేవలు అందించ డానికి కృషి చేస్తున్నట్టు ఆ సంస్థ ఎమర్జన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ సీఈవో పాపిరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఆవర ణలోగల 108 సెంటర్‌ వద్ద 108 వాహనాన్ని తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వంతో కలిసి తమ సంస్థ ఈ ఏడాది జూలైలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం 48 వాహ నాలు ఉన్నాయని వాటి ద్వారా సెప్టెంబరు నాటికి 74 వేల మంది పేషెంట్లకు సేవలందించినట్టు తెలిపారు. సిబ్బంది షెల్టర్‌ ఇతర సౌకర్యాలకు కొన్ని ప్రాంతాలలో భవనాలు లేవని, జిల్లావ్యాప్తంగా 28 సెంటర్లలో సిబ్బందికి సౌకర్యాలు లేవని అందు వల్ల ఆయా ప్రాంతాల్లో దాతలు ముందుకు వస్తే వారిపేరుతో భవ న నిర్మాణం చేపడతామని తెలిపా రు. ఒక్కొ వాహనానికి 2 షిప్టులుగా నలుగురు ఉంటారని వారికి రిలీవ ర్లు ఉంటారని తెలిపారు. వాహ నంలో అందుబాటులో ఉన్న సౌక ర్యాలను పరిశీలించారు. కార్యా లయంలో రికార్డులు పరిశీలించి, సిబ్బంది పని తీరును అభినందించారు. 108 జిల్లా మేనేజర్‌  కె.గణేష్‌, 104 జిల్లా మేనేజర్‌ (ఎఈఎంఎస్‌) బి.సాయి గణేష్‌, 108 ఎగ్జిక్యూటివ్‌ ప్రకాష్‌,104 ఎగ్జిక్యూటివ్‌ మూర్తి, సిబ్బంది శివ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement