అరకొర దిగుబడి- నాసిరకంగా ఉత్పత్తి

ABN , First Publish Date - 2022-02-18T06:33:46+05:30 IST

వర్షం పడితే రైతుకు సంతోషం.. తమ పంటలకు జీవం వచ్చి మొక్క పచ్చబడి మంచి దిగుబడి వచ్చి లాభాల పడతామని ఆశ.. కానీ ఆ చినుకే శాపమైతే రైతు రైతు ఎవరికి చెప్పుకోవాలి.. అదే జరిగింది. సంక్రాంతి సమయంలో పడిన వర్షం వలన పొగాకు, మిర్చి పంటలు దారుణంగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అరకొర దిగుబడి- నాసిరకంగా ఉత్పత్తి
వాడిపోయిన ఆకు


కురిచేడు, ఫిబ్రవరి 17: వర్షం పడితే రైతుకు సంతోషం.. తమ పంటలకు జీవం వచ్చి మొక్క పచ్చబడి మంచి దిగుబడి వచ్చి లాభాల పడతామని ఆశ.. కానీ ఆ చినుకే శాపమైతే రైతు రైతు ఎవరికి చెప్పుకోవాలి.. అదే జరిగింది. సంక్రాంతి సమయంలో పడిన వర్షం వలన పొగాకు, మిర్చి పంటలు దారుణంగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.
మండలంలో సంక్రాంతి పర్వదినం ముందు భోగి పండుగ రోజు ఉదయాన్నే బారీ వర్షం కురిసింది. ఆ వర్షం రైతులను నట్టేట ముంచింది. వారికి శాపంగా మారి వారి పంటలను నాశనం చేసింది. ఆ వర్షం చినుకులు వైట్‌ బర్లీ పొగాకు పంట ఆకుల మీద నిలువ ఉన్న చోట ముందుగా మచ్చలు పడ్డాయి. ఆ తరువాత అక్కడ రంధ్రాలు పడి ఆకు నాణ్యత కోల్పోయింది. దీని వలన రైతులు నాణ్యత లేని పొగాకును అమ్మకానికి ఉంచితే నాణ్యత లేదని తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే మిర్చి కాయలమీద వర్షపు నీరు పడి అవి కూడా అలాగే నాణ్యత లేకుండా తాలు కాయలు వచ్చాయి. ఆకులు తెల్లగా మారి మొక్కలు ఎండిపోయాయి. వర్షంతో మొక్కలు బాగుంటాయనుకుంటే ఎండిపోయి నష్టాల పాలయ్యామని రైతులు వాపోతున్నారు. మండలం మొత్తం మీద రైతులు ఈ అకాల వర్షం ధాటికి లక్షల్లో నష్టపోయారు. ఈ సంవత్సరం కాలం కలసి రాక నష్టాలలో ఉన్న రైతులకు ఈ వర్షం మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇలా అప్పుల పాలు కావడమే అని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2022-02-18T06:33:46+05:30 IST