అరకొరగా రెమ్‌డెసివిర్‌

ABN , First Publish Date - 2021-05-10T05:55:11+05:30 IST

కరోనా పాజిటివ్‌ వ్యక్తుల చికిత్సలో కీలకంగా మారిన రెమ్‌డెసివిర్‌ వాయిల్స్‌ అందక అవస్థలు ఎదుర్కొం టున్నారు.

అరకొరగా రెమ్‌డెసివిర్‌
జగిత్యాల ఔషద నియంత్రణ పరిపాలన కార్యాలయం

అవస్థల్లో కరోనా బాధితులు

ఇంజక్షన్‌ కోసం ఇతర జిల్లాలకు పరుగులు

జగిత్యాల, మే 9 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ వ్యక్తుల చికిత్సలో కీలకంగా మారిన రెమ్‌డెసివిర్‌ వాయిల్స్‌ అందక అవస్థలు ఎదుర్కొం టున్నారు. జగిత్యాల జిల్లాకు అరకొరగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లను ప్ర భుత్వం కేటాయిస్తోంది. డిమాండ్‌ మేరకు సరఫరా లేకపోవడంతో పా జిటివ్‌ బాధితులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అవసరమైన స మయాల్లో రెమ్‌డెసివిర్‌ వాయిల్స్‌ స్టాక్‌ లేకపోవడం, స్టాక్‌ ఉన్న సమ యాల్లో అరకొరగా అందుతుండడం వల్ల నిష్ప్రయోజనంగా మారు తుండడంతో ఆవేదనకు గురవుతున్నారు. రెమ్‌డెసివిర్‌ వాయిల్స్‌ అవ సరం మేరకు అందకపోవడంతో బాధితులు నరకయాతనకు గురవు తున్నారు. 

జిల్లాలో అరకొరగా సరఫరా....

జిల్లాలోని డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ కార్యాలయంలో ఎంఆర్‌పీ ధరలకే రెమ్‌ డెసివిర్‌ వాయిల్స్‌ను పంపిణీ చేశారు. గత నెల 30వ తేదీ నుంచి డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ కార్యాలయంలో అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సు మారు 300 వాయిల్స్‌ పంపిణీ చేశారు. వైద్యుల ప్రిస్కిప్షన్‌తో వచ్చిన బాధితులకు తీవ్రతను బట్టి రెమ్‌డెసివిర్‌ వాయిల్స్‌ అందించారు. ఒక్కో వాయిల్‌ను రూ. 3,490 ఎంఆర్‌పీ ధరకు అందించారు. వందల సం ఖ్యలో రెమిడెసివిర్‌ వాయిల్స్‌ అవసరమవుతుండగా పదుల సంఖ్యలో సరాఫరా చేస్తుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జిల్లాలోని నా లుగు ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ఓ కంపెనీ యాప్‌ ద్వారా నేరుగా రెమ్‌డెసివిర్‌ అందించారు. జిల్లా కేంద్రంలోని మూడు ప్రైవేటు ఆ స్పత్రులతో పాటు కోరుట్లలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్‌ అందిస్తున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో రెమ్‌డెసివిర్‌ తీవ్ర కొరత ఉండడంతో సమీపంలోని సిరిసిల్ల జిల్లా నుంచి సైతం తెప్పించిన సం ఘటనలున్నాయి.

వందల సంఖ్యలో రోగులు...

జిల్లాలోని 18 మండలాల్లో ప్రతినిత్యం వందల సంఖ్యలో వ్యక్తులు పాజిటివ్‌కు గురవుతున్నారు. సగటున రోజుకు 600 నుంచి 800 మం దికి పాజిటివ్‌గా తేలుతోంది. ఇందులో సగానికి పైగా మంది హోం ఐ సోలేషన్‌లో ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన మందుల కిట్‌ వినియోగిస్తూ కోలుకుంటున్నారు. మరికొందరు తీవ్ర జలుబు, దగ్గు, దమ్ము వంటి వా టితో ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాసకోస సమస్యలున్న వ్యక్తులు సమీప ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొం దుతున్నారు. ఇటువంటి వ్యక్తులకు అవసరమైన సమయాల్లో రెమిడెసి విర్‌ ఇంజక్షన్‌లను ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక్కడి నుంచి సంబందిత రోగి బందువులు, స్నేహితులకు ఇబ్బందులు ప్రారంభం అ వుతున్నాయి. జిల్లాలో డిమాండ్‌ మేరకు సరఫరా లేకపోవడంతో డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ కార్యాలయంలో ఎప్పుడూ చూసిన నో స్టాక్‌ బోర్డు దర్శనమిస్తోంది. 

పొరుగు జిల్లాల వైపు పరుగులు...

జిల్లాలో ఏర్పడుతున్న రెమిడెసివిర్‌ వాయిల్స్‌ కొరత వల్ల బాధిత కుటుంబాల వ్యక్తులు పొరుగు జిల్లాల వైపు పరుగులు తీస్తున్నారు. జి ల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి వంటి పట్టణాల్లో గల ఆసుపత్రు ల్లో కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న తమ వారికి వాయిల్స్‌ సేక రించి ఇవ్వడానికి నానా అవస్థలు పడుతున్నారు. పొరుగున గల సిరి సిల్ల, కరీంనగర్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ వంటి జిల్లాలకు వెళ్లి వాయిల్స్‌ ను సేకరిస్తున్నారు. అక్కడి డ్రగ్స్‌ కంట్రోల్‌ కార్యాలయాల్లో లభిస్తే ఎం ఆర్‌పీ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. లేని యెడల రూ. వేలు వె చ్చించి గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌లో రెమిడెసివిర్‌ కొనుగోలు చేస్తు న్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉంటేనే రెమిడెసివిర్‌ అలాంట్‌ మెంట్‌ అవ సరము మేరకు అవుతున్నాయని, లేని యెడల నామమాత్రంగా కేటా యింపులు జరుపుతున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాకు అవసర మైన మేరకు కేటాయింపులు జరపడానికి ప్రజాప్రతినిధులు జోక్యం చేసు కోవాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిబంధనల మేరకు అందిస్తున్నాము

- ఉపేందర్‌, డ్రగ్స్‌ ఇన్స్‌పెక్టర్‌, జగిత్యాల

జిల్లా కేంద్రంలోని ఔషద నియంత్రణ పరిపాలన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో నిబంధనల మేరకు రెమిడెసివిర్‌ వాయిల్స్‌ ను విక్రయిస్తున్నాము. రోగుల అవసరం మేరకు సరఫరా ఉండడం లే దు. దీంతో తీవ్ర కొరత ఏర్పడుతోంది. పలు పర్యాయాలు ప్రజాప్రతిని ధులు, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకవెళ్లాము. వాయిల్స్‌ కేటాయింపులు మరింత పెంచాల్సిన అవసరముంది. 




Updated Date - 2021-05-10T05:55:11+05:30 IST