అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలిగా సంధ్యారాణికి అవకాశం

ABN , First Publish Date - 2020-09-28T21:16:33+05:30 IST

అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి టీడీపీ అధ్యక్షురాలిగా సాలూరుకు చెందిన..

అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలిగా సంధ్యారాణికి అవకాశం

1999 నుంచి రాజకీయాల్లో కీలకంగా రాణింపు

తండ్రి వారసత్వంగా రాజకీయ అరంగేట్రం


(విజయనగరం- ఆంధ్రజ్యోతి): అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి టీడీపీ అధ్యక్షురాలిగా సాలూరుకు చెందిన ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణిని అధినేత నియమించారు. ఈమె ప్రారంభం నుంచి పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. నాయకులు, శ్రేణులను కలుపుకుంటూ ముందుకు వెళ్తారన్న నమ్మకం కేడర్‌లో సైతం ఉంది. 2014 ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2019లో కూడా అరకు పార్లమెంట్‌కు పోటీ చేయాలని అధిష్టానం కోరినప్పటికీ ఆమె సాలూరు అసెంబ్లీ టిక్కెట్టును ఆశించారు. అనివార్య కారణాలతో టిక్కెట్టు దక్కలేదు. అయినప్పటికీ ఆమె నిరాశ పడకుండా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు శక్తివంచన లేకుండా పనిచేశారు.


పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు. అరకు  పార్లమెంట్‌ నియోజకవర్గపరిధిలో శ్రీకాకు ళం జిల్లా లోని పాలకొండ.. విజయనగరం జిల్లాలోని కురుపాం, పార్వతీ పురం, సాలూరుతోపాటు విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు.. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇ లా భౌగోళి కంగా పెద్ద నియోజకవర్గం. పార్టీ కార్యక్రమాలకు వెళ్లాల ంటే సమస్యతో కూడుకున్న పనే అయినా ఆమె చక్కగా నెగ్గుకురాగలరన్న ధీమాను శ్రేణులు వ్యక్తంచేస్తున్నాయి. ఏజెన్సీ పరిధిలో పార్టీలో కొత్త జోష్‌ తీసుకొస్తారంటున్నాయి.


తండ్రి వారసత్వంతో..

ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి కాంగ్రెస్‌ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. తండ్రి జన్ని ముత్యాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. సంధ్యారాణి స్వగ్రామం మక్కు వ మండలం కవిరిపల్లి. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ తండ్రి రాజకీయ వార సత్వాన్ని పుణికిపుచ్చుకుని కాంగ్రెస్‌లో చేరారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్టు కేటాయించలేదు. తరువాత వైఎస్‌ ప్రభుత్వంలో ఐసీడీఎస్‌, మహిళా కమిషన్‌ సభ్యురాలిగా బాధ్యతలు చూశారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు.


ఆ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజన్నదొరపై ఓటమిచెందారు. తరువాత 2014లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి చెందారు. 2015లో టీడీపీ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. తాజాగా అరకు పార్లమెంట్‌ స్థానానికి పార్టీ అధ్యక్షురాలిగా నియామకమయ్యారు.


పార్టీ విజయానికి కృషి చేస్తా

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి శాయ శక్తులా కృషి చేస్తాను. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జెండా రెపరెపలాడేలా చూస్తాను. అధినేత, మా జీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ పదవిని బాధ్యతగా నిర్వహిస్తాను. పార్టీ పెద్దలతో పాటు కేడర్‌ను కలుపుకుని పార్టీ విజయానికి కృషి చేస్తాను.

- గుమ్మిడి సంధ్యారాణి, అరకు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు




Updated Date - 2020-09-28T21:16:33+05:30 IST