2023 మార్చిలోగా ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ఓవర్‌

ABN , First Publish Date - 2022-01-20T16:16:41+05:30 IST

నగరంలో వ్యూహాత్మక ర హదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌.ఆర్‌.డి.పి)లో భాగంగా బహదూర్‌పురా ఫ్లై ఓవర్‌, ఆరాంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు చేపట్టిన..

2023 మార్చిలోగా ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ఓవర్‌

సీఎస్‌ సోమే్‌షకుమార్‌

నిర్మాణ పనుల ఆకస్మిక తనిఖీ 


హైదరాబాద్‌ సిటీ/మదీన, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): నగరంలో వ్యూహాత్మక ర హదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌.ఆర్‌.డి.పి)లో భాగంగా బహదూర్‌పురా ఫ్లై ఓవర్‌, ఆరాంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు చేపట్టిన 4.08 కి.మీ. అతిపెద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులను లక్ష్యం కన్నా ముందుగానే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమే్‌షకుమార్‌ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. బహదూర్‌పురా జంక్షన్‌లో చేపట్టిన పలు నిర్మాణ పనులను ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌తో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోమే్‌షకుమార్‌ మాట్లాడుతూ రూ.69కోట్ల వ్యయంతో బహదూర్‌పురాలో చేపట్టిన 690మీటర్ల పొడవుగల ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు, జూపార్క్‌ సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడే ఆరాంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను 2023 మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.


ఆరాంఘర్‌- జూ పార్క్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తుల్లో మరికొన్ని సేకరించాల్సి ఉన్నందున పనులకు అంతరాయం కలుగుతోందని ఇంజనీర్లు వివరించారు. ఫ్లైఓవర్‌ మౌలిక డిజైనింగ్‌కు అంతరాయం కాకుండా కొన్ని ఆస్తుల సేకరణ చేయకుండానే నిర్మాణాన్ని పూర్తిచేయాలని సీఎస్‌ సూచించారు. ఆరాంఘర్‌-జూపార్క్‌ ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణం పనులు ఏ విధమైన అవాంతరాలు లేకుండా జరిగేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ, అర్బన్‌ బయోడైవర్సిటీ, వాటర్‌బోర్డు తదితర విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఎన్‌సీ జియాఉద్దీన్‌, ప్రాజెక్ట్‌ సి.ఇ.దేవానంద్‌, చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌, ఎస్‌.ఈ దత్తుపంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T16:16:41+05:30 IST