Abn logo
Oct 21 2020 @ 23:37PM

సంక్రాంతికి ‘అరణ్య’

Kaakateeya

సంక్రాంతికి థియేటర్లలో ‘అరణ్య’ చిత్రంతో రానా దగ్గుబాటి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళంలో ‘కాండన్‌’గా రూపొందిన బహుభాషా చిత్రమిది. వాస్తవానికి, ఈ ఏడాది ఏప్రిల్‌ 2న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా వల్ల కుదరలేదు. ఇప్పుడు మూడు భాషల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్టు ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రకటించింది. జనవరి 15, 2021న సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అటవీ నిర్మూలన సంక్షోభం, పర్యావరణ సమస్యల నేపథ్యంలో పాతికేళ్లుగా అడవుల్లో జీవిస్తున్న వ్యక్తి కథతో ‘అరణ్య’ రూపొందించామని దర్శకుడు ప్రభు సాల్మన్‌ అన్నారు. అడవుల్లో జీవిస్తున్న మనిషిగా రానా నటించారు. తమిళ నటుడు విష్ణు విశాల్‌, జోయా హేస్సేన్‌, శ్రియా పిల్గావోంకర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శంతను మొయిత్రా సంగీతం అందించిన ఈ చిత్రానికి ఏఆర్‌ అశోక్‌కుమార్‌ ఛాయాగ్రాహకుడు.

Advertisement
Advertisement