ఘనంగా ఆదిత్యుని తిరువీధి

ABN , First Publish Date - 2021-01-16T05:29:46+05:30 IST

మకర సంక్రాంతి సందర్భంగా శ్రీసూర్య నారాయణ స్వామికి గురువారం తిరువీధి నిర్వహించారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా నిర్వహించిన తిరువీధిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శిం చుకున్నారు.

ఘనంగా ఆదిత్యుని తిరువీధి
ఆదిత్యుని తిరువీధి దృశ్యం


గుజరాతీపేట, జనవరి 15:  మకర సంక్రాంతి సందర్భంగా శ్రీసూర్య నారాయణ స్వామికి గురువారం తిరువీధి నిర్వహించారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా నిర్వహించిన తిరువీధిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శిం చుకున్నారు. ఉదయాన్నే స్వామి వారి నిజ రూప దర్శనం, అలంకార సేవలను నిర్వహించారు. అనంతరం అనివెట్టి మండపంలో సంక్రమణ పూజ, నీరాజనం, వేదపఠనం తదితర సేవలను నిర్వహించినట్టు ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. 

 

Updated Date - 2021-01-16T05:29:46+05:30 IST