Abn logo
May 6 2020 @ 21:33PM

ప్ర‌భాస్ 21 విల‌న్ ఎవ‌రంటే..?

భాష‌తో సంబంధం లేకుండా ఉత్తరాదిన‌, ద‌క్షిణాదిన క్రేజ్ సంపాదించుకున్న న‌టుల్లో అర‌వింద‌స్వామి ఒక‌రు. ఈయ‌నకు పాత్ర న‌చ్చితే విల‌న్‌గా కూడా న‌టించ‌డానికి రెడీ అంటారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌.. తెలుగులో ‘ధృవ’ చిత్రంలో అర‌వింద‌స్వామి విల‌న్‌గా న‌టించ‌డ‌మే. కాగా అర‌వింద‌స్వామి మ‌రో తెలుగు సినిమాలోనూ విల‌న్‌గా న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ సినిమా ఏదో కాదు.. ప్ర‌భాస్ 21. యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ పాన్ ఇండియా మూవీ తెర‌కెక్క‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. క‌రోనా ప్ర‌భావంతో ఆగిన ప్ర‌భాస్ 20వ సినిమా పూర్తి కాగానే.. ప్ర‌భాస్ 21 సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. మ‌రి ఈ చిత్రంలో అర‌వింద‌స్వామి విల‌న్‌గా న‌టిస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో వినిపిస్తోన్న‌ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement