Aryan Khan కేసులో అరెస్టయిన అర్బాజ్ మర్చంట్‌కు షాకింగ్ అనుభవం.. ఎన్సీబీ ఆఫీసులోకి వెళ్లి వస్తుండగా..

ABN , First Publish Date - 2021-11-26T23:39:42+05:30 IST

ప్రముఖ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు డ్రగ్స్ కేసులో గత నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌తోపాటు అరెస్టు అయి

Aryan Khan కేసులో అరెస్టయిన అర్బాజ్ మర్చంట్‌కు షాకింగ్ అనుభవం.. ఎన్సీబీ ఆఫీసులోకి వెళ్లి వస్తుండగా..

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు డ్రగ్స్ కేసులో గత నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌తోపాటు అరెస్టు అయిన అర్బాజ్ మర్చంట్‌కు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. అతడు ఎన్సీబీ ఆఫీసులోకి వెళ్లి వస్తుండగా.. జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ అక్కడ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..


డ్రగ్స్ కేసులో హీరో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను గత నెలలో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో అధికారులు.. అర్బాజ్ మర్చంట్‌ను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉండగా.. ఆర్యన్ ఖాన్‌తోపాటు అర్బాజ్ మర్చంట్‌కు కూడా కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. ఈ క్రమంలోనే అర్బాజ్ మర్చంట్.. ప్రతి వారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లి, అధికారుల ముందు హాజరవుతున్నాడు. కాగా.. ఎప్పటిలాగే శుక్రవారం రోజు తన తండ్రితో కలిసి ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లిన అర్బాజ్ ఖాన్.. అధికారుల ముందు హాజరయ్యాడు. 



అనంతరం అక్కడ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో.. కార్యాలయం వద్ద ఉన్న మీడియా ప్రతినిధులు.. ఫొటోలకు ఫోజిలివ్వాలని ఆ తండ్రీకొడుకులను కోరారు. దీంతో అర్బాజ్ ఖాన్ తండ్రి తన కొడుకుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చేందుకు రెడీ అయ్యాడు. అంతేకాకుండా అర్బాజ్ ఖాన్ కారు వద్దకు వెళ్తుంటే.. అతడిని వెనక్కి పిలిచి మరీ ఫొటోలకు స్టిల్స్ ఇవ్వమన్నాడు. దీంతో అర్బాజ్ ఖాన్ ఒక్కసారిగా షాకయ్యాడు. తండ్రి కోరడంతో.. అయిష్టంగానే ఫొటోలకు ఫోజిచ్చాడు. ఇంకొన్ని ఫోజులిద్దాం అని తండ్రి కోరడంతో.. అర్బాజ్ ఖాన్ తన చేతిని తలకేసి కొట్టుకుని అసహనం వ్యక్త పరిచాడు. అనంతరం కారు వద్దకు వెళ్లి.. అందులో కూర్చున్నాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. 






Updated Date - 2021-11-26T23:39:42+05:30 IST