ఇష్టారాజ్యంగా ఎన్‌హెచ్‌ రోడ్డు పనులు

ABN , First Publish Date - 2022-01-28T05:06:24+05:30 IST

సంవత్సకాలంగా నడుస్తున్న నేషనల్‌ హైవే రోడ్డు నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తు నచ్చినవిధంగా పనులు చేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా ఎన్‌హెచ్‌ రోడ్డు పనులు
మురుగునీటిని వీధుల్లోకి తోడేయటాన్ని అడ్డుకుంటున్న స్థానిక మహిళలు, ప్రజలు

పనులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

ఎర్రగుంట్ల, జనవరి 27: సంవత్సకాలంగా నడుస్తున్న నేషనల్‌ హైవే రోడ్డు నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తు నచ్చినవిధంగా పనులు చేస్తున్నారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద పనులు చేయబట్టి ఇప్పటికే నాలుగునెల లైంది. గుంతలు తీసి అలాగే వదిలేశారు. దీంతో దుకాణం దారులు, వ్యాపారాలు ఇబ్బంది పడుతుండగా దుమ్ముతో, ట్రాఫి క్‌ సమస్యతో ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాలుగురోడ్ల వద్ద డ్రైనేజీ వేసే నేపథ్యంలో గుంతల్లో ఆగిన నీటిని ఎక్స్‌కవరేటర్‌తో రోడ్డుపై తోడేస్తున్నారు. దీంతో రోడ్డు బురదగా మారింది. వాహనాల రాకపోకల వలన ఏర్పడుతున్న దుమ్ము ధూళీని ప్రజలు భరించలేకపోతున్నారు. గురువారం పోలీసుస్టేషన్‌ ఎదురుగా డ్రైనేజీ నీటిని రోడ్డుపైకి తోడేయడంతో అవి వలసపల్లె రోడ్డులోని వీధుల్లోకి ప్రవహించి ఇళ్లముందు ఆగిపోయాయి. దీంతో ఇందుముందు బురద, తీవ్ర దుర్గంధం రావడంతో ఆ వీధి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. బురద నీటిని ఇళ్లముందు వేస్తారా అంటూ నిలదీశారు. పది నెలలుగా ముద్దనూరు రోడ్డు లో డ్రైనేజీ పనులు జరుగుతున్నా డ్రైనేజిపై మూతలు వేయలే దు. బర్మ్‌రోడ్డోలో బర్మ్‌ వేయలేదు. సందుల్లో వెళ్లేందుకు సరైన దారి కల్పించలేదు. దుకాణాల్లోకి, వీధుల్లోకి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో స్థానికులు గుంతల్లో బీటీ రోడ్డుకు ఆనుకు ని పెద్ద రాళ్లు వేస్తున్నారు.  మాకేమీ సంబందం లేదన్నట్లుగా ఎన్‌హెచ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు వ్యవహరిస్తుండటం దారు ణమని పలువురు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-01-28T05:06:24+05:30 IST