Abn logo
Jan 16 2021 @ 19:17PM

ఆ ప్రశ్న మన దర్శక, నిర్మాతలనే అడగాలి : హీరోయిన్ అర్చన

తెలుగు, తమిళ సినీరంగాలలోని 39 మంది ప్రముఖ నటీనటులతో పాటు మహానటి జమున నటించిన చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు'. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా,  మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించగా...హీరో హీరోయిన్లుగా బాలాదిత్య, అర్చన నటించారు.  ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అర్చన మాట్లాడుతూ "2020 ప్రభావం మనపై బాగా చూపించింది.  ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నా.  అన్నపూర్ణమ్మ, జమునగారి సినిమాలను చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగాను. వాళ్ల మూవీలో నటించే చాన్స్ రావడం సంతోషంగా ఉంది.  కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న  చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు ఈ చిత్రం చాలా బావుందని ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఇందులో మెడికల్ స్టూడెంట్‌గా మొదలయ్యే నా పాత్ర ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవడం, ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశాను. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరువు హత్యలను కూడా ఈ చిత్రంలో చూపించారు. 

నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను. దర్శకుడు నర్రా శివానాగేశ్వరరావు చిత్రంతో పాటు నా పాత్రను అద్భుతంగా మలిచారు.  నేను నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ మూవీ తో మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా. తెలుగు అమ్మాయిగా మీరెందుకు ఎక్కువ సినిమాలు తెలుగులో చేయడం లేదు అని చాలా మంది అంటుంటారు. అయితే నేను చెప్పదొక్కటే.. ఆ విషయం మన దర్శక నిర్మాతలనే అడగాలి. ఎందుకంటే నాకు పరిచయం ఉన్న దర్శకులతో నాకు అవకాశం ఇవ్వండని నేను నేను అడగగలను కానీ తెలియని వారిని అడగలేను కదా.  నాకిచ్చిన పాత్ర ఏదైనా సిన్సియర్‌గా చేస్తాను. ‘నేను’ మూవీ తో కెరీర్ స్టార్ట్ చేసిన నాకు చాలా మంచి పాత్రలు వచ్చాయి.  శ్రీరామదాసులో సీత పాత్రతో మరింత పేరు వచ్చింది. నా వర్కింగ్ స్టైల్ అంటూ నాకుంటుంది. ఒక పాత్రకే పరిమితమయ్యేలా చూసుకోను. నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. స్పెషల్ సాంగ్స్ చేయడం,  గ్లామర్ రోల్స్ చేయడం వల్ల ఆఫర్స్ తగ్గుతాయని నేను అనుకోను. పెళ్లి తర్వాత హ్యాపీ గా ఉన్నాం. నా భర్త దృష్టిలో నేనే సూపర్ స్టార్.  ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాను.  కెమెరామెన్  అంజి డైరెక్షన్‌లో ఒక ప్రాజెక్ట్ఖ్‌కి సైన్ చేశాను. చాలా ఇంటరెస్టింగ్ రోల్‌లో  నటిస్తున్నాను " అన్నారు.

Advertisement
Advertisement
Advertisement