కరోనాతో పూజారి మృతి

ABN , First Publish Date - 2021-05-05T06:39:09+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామి సేవలో ఉన్న పూజారి కుటుంబాన్ని కరోనా దెబ్బతీసింది.

కరోనాతో పూజారి మృతి

వారం క్రితం తల్లి కూడా మృతి

ఆ కుటుంబంలోని మిగిలిన ఒక వ్యక్తులు కందుకూరు వైద్యశాలలో...

లింగసముద్రం, మే 4 : మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామి సేవలో ఉన్న పూజారి కుటుంబాన్ని కరోనా దెబ్బతీసింది. ఇప్పటికి ఇద్దర్ని పొట్టనపెట్టుకోగా మరికొందరు ప్రస్తుతం ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకెళ్తే... లింగసముద్రం గ్రామానికి చెందిన పూజారి మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్నారు. అతనికి వారం క్రితం కరోనా సోకగా ఒంగోలు రిమ్స్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ  మంగళవారం ఉదయం చనిపోయారు. ఆ పూజారిని కాపాడుకొనేందుకు భక్తులు, దేవాలయాల నిర్వాహకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పూజారి చనిపోయాడని తెలుసుకున్న వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన లింగసముద్రంలోని వాకమళ్లవారిపాలెం అయ్యప్పస్వామి ఆలయ నిర్వాహకులు ఆర్‌ఎంపీ విజయభాస్కర్‌, పంగా కృష్ణారెడ్డి, షేక్‌ షఫీ తదితరులు పూజారి మృతదేహాన్ని కడసారి చూసేందుకు రిమ్స్‌కు వెళ్లారు. వారం క్రితం ఆ పూజారి తల్లి కూడా కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే కుటుంబంలో పూజారి సోదరుడు ఒకరు కరోనాకు కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, మరో ఆరుగురు స్త్రీ, పురుషులు(పిల్లల సహా) కందుకూరులోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. వీరి కుటుంబంలోని పూజారి ఇంకో సోదరుడికి మాత్రం కరోనా సోకలేదు.

Updated Date - 2021-05-05T06:39:09+05:30 IST