ఫోన్‌ కాంటాక్ట్స్‌ రిపీట్‌ అవుతున్నాయి?

ABN , First Publish Date - 2020-09-05T05:00:51+05:30 IST

నా ఫోన్లో రమారమి నలభై వరకు కాంటాక్టులు పదేపదే రిపీట్‌ అవుతున్నాయి.

ఫోన్‌ కాంటాక్ట్స్‌ రిపీట్‌ అవుతున్నాయి?

నా ఫోన్లో రమారమి నలభై వరకు కాంటాక్టులు పదేపదే రిపీట్‌ అవుతున్నాయి. వాటిని ఎన్నిసార్లు డిలీట్‌ చేసినా మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ఆ ఫోన్లో మూడు జీమెయిల్‌ అకౌంట్లతో లాగిన్‌ అయ్యాను. కాంటాక్టుల విషయంలో నాకు తలెత్తుతున్న సమస్యకు పరిష్కారం చూపగలరు.  

- దీపక్‌ తేజ, పార్కపల్లి


మీరు చెప్పిన దాని ప్రకారం, ఒక ఆండ్రాయిడ్‌ ఫోన్‌కి మూడు జీమెయిల్‌ ఐడిలు లింక్‌ చేసినప్పుడు తప్పనిసరిగా ఆయా అకౌంట్లలో ఉన్న కాంటాక్టులు అన్నీ వాటంతట అవే సింక్‌ అవుతుంటాయి. గూగుల్‌ కాంటాక్ట్స్‌లో ఉన్న కాంటాక్టులను ‘ఆండ్రాయిడ్‌ ఫోన్లు’ మన ఫోన్లోకి తీసుకు వస్తూ ఉంటాయి.


ఈ నేపథ్యంలో ఒకవేళ మీ దగ్గర శ్రీధర్‌ అనే కాంటాక్ట్‌ మీ మూడు జీమెయిల్‌ అకౌంట్లలో సేవ్‌ చేసి ఉన్నట్లయితే, అది మీ ఫోన్లో మూడుసార్లు  డూప్లికేట్‌గా కన్పిస్తుంది. ఇక్కడ మీరు చేయవలసిందల్లా ప్రధానంగా మీరు వాడుతున్న ఒక జీమెయిల్‌ అకౌంట్‌ మాత్రమే ఉంచి, మిగతావి మీ ఫోన్‌ సెట్టింగ్స్‌లో అకౌంట్స్‌ విభాగం నుంచి తొలగించాలి. లేదా మూడూ కావాలనుకుంటే, మిగిలిన రెండు అకౌంట్లలో కాంటాక్ట్స్‌ సింక్‌ డిజేబుల్‌ చేయాలి. ఆ తరవాత గూగుల్‌ ప్లే స్టోర్లో లభించే డూప్లికేట్‌ కాంటాక్ట్స్‌ రిమూవర్‌ వంటి యాప్స్‌ ద్వారా డూప్లికేట్‌ కాంటాక్ట్స్‌ని తొలగించడమే తగిన పరిష్కారం.


Updated Date - 2020-09-05T05:00:51+05:30 IST