గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించరా?

ABN , First Publish Date - 2021-10-18T06:39:19+05:30 IST

నవరత్నాల పేరుతో అప్పులు చేసే రాష్ట్ర ప్రభుత్వం 24 నెలలుగా గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు ఇవ్వకపోవడం పట్ల సీపీఐ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించరా?
కార్యక్రమంలో మాట్లాడుతున్న నారాయణ

ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం

పుత్తూరు, అక్టోబరు 17: నవరత్నాల పేరుతో అప్పులు చేసే రాష్ట్ర ప్రభుత్వం 24 నెలలుగా గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు ఇవ్వకపోవడం పట్ల సీపీఐ సీపీఐ జాతీయ కార్యదర్శి  కె. నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌ అంబాసిడర్ల జిల్లా ప్రఽథమ మహాసభ ఆదివారం నగరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా వచ్చిన నారాయణ మాట్లాడుతూ పారిశుధ్య పనులు నిర్వహించే  గ్రీన్‌ అంబాసిడర్ల వేతనాల చెల్లింపు గురించి పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనంతో వారితో పని చేయించుకోవడం అన్యాయమన్నారు. కరోనా కష్ట కాలంలో కార్మికులు ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేశారన్నారు.  గ్రీన్‌ అంబాసిడర్ల  సమస్యలను వెంటనే    పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ముందుగా నగరిలోని ఓంశక్తి ఆలయం నుంచి టవర్‌ క్లాక్‌ మీదుగా నాగలాపురం రోడ్డులోని షాదీమహల్‌ వరకు కార్మికుల నిరసన ర్యాలీ ఇర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, నాయకులు రామచంద్రయ్య, శ్రీరాములు, కోదండయ్య, రాధాకృష్ణ, సీపీఐ కారకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Updated Date - 2021-10-18T06:39:19+05:30 IST