Abn logo
Sep 25 2021 @ 00:28AM

పంటలు ఎండిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టదా?

పంటను పరిశీలిస్తున్న రాంభూపాల్‌

ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలి..

సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌


అనంతపురం టౌన, సెప్టెంబరు 24: రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలు ఎండిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టదా? అని సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ ప్రశ్నించారు. శుక్రవారం సీపీఎం నాయకులు రాప్తాడు మండలంలోని గంగులకుంటలో పర్యటించి, ఎండిపోతున్న వేరుశనగ పంటలను సందర్శించారు. పంట ఎండిపోతుండడంతో వేరుశనగ మొక్కలను తొలగిస్తున్న రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడు తూ.. జూన, జూలై నెలల్లో వర్షం పడడంతో రైతులు అప్పులు చేసి మరీ పంటలు వేశారనీ, ఇపుడు చేతికొచ్చే సమయంలో 20 రోజులుగా వర్షాలు లేక వేరుశనగ ఊడలు కూడా దిగని పరిస్థితి నెలకొందన్నారు. పైకి చెట్టు పచ్చగా కనిపిస్తున్నా.. వే ర్లకు కాయలు కాయలేదనీ, దీంతో రాబోవు నాలుగైదు రోజుల్లో వర్షం పడినా ప్రయోజనం ఉండదన్నారు. ఈ కారణంగా రై తాంగం పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా.. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను ఎందుకు పరిశీలించడం లేదని ప్ర శ్నించారు. చెరువులు, కుంటల్లో ఉన్న నీటిద్వారా కనీసం రక్షక తడులు చేయడానికీ ప్రభుత్వం చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు. రైతు ఎకరాకు దాదాపు రూ.24 వేలు పెట్టుబడు లు పెట్టి.. నష్టపోతుండగా.. ప్రభుత్వం రూ.13,500 ఇచ్చి చేతు లు దులుపుకుంటోందన్నారు. అది కూడా నాలుగు విడతల్లో ఇవ్వడంవల్ల ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.25వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం నాయకులు బాలరంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి పా ల్గొన్నారు.