Advertisement
Advertisement
Abn logo
Advertisement

గురుకులాల్లో విద్యార్థులకు సౌకర్యాలేవి?

మొయినాబాద్‌ రూరల్‌: తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం విద్యార్థులకు మౌలికవసతులు కల్పించడంలో విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు షాపురం శ్రీకాంత్‌యాదవ్‌ విమర్శించారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు సక్రమంగా భోజనం, నీరు అందించడం లేదన్నారు. సరూర్‌నగర్‌లోని హూడా కాలనీలో ఉన్న గురుకుల పాఠశాలనే నిదర్శనమని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో తాగునీరు, ఆహారం, పారిశుధ్య పనుల్లో సమస్యలు తలెత్తుతున్నాయని ఎన్నిసార్లు తెలిపినా అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కారించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ అఽధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బొజ్జగణేష్‌, ఉదయ్‌, అజయ్‌, వినయ్‌ ఉన్నారు. 

Advertisement
Advertisement